స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంద్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం కర్నూలు జిల్లాలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో సీయం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15 తేదీ నుంచి మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అములు చేస్తామని తెలిపారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తింప చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి యేటా రైతుల అకౌంట్ లో 14వేల రూపాయలు వేస్తామని చెప్పారు. కేంద్ర ఇచ్చే 6 వేల రూపాయలకు అదనంగా 8వేలు కలిపి మొత్తం 14 వేల రూపాయలు ఇస్తామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతు బజార్లను మొదటి సారిగా నేనే ఏర్పాటు చేశానని తెలిపారు.
- Advertisement with us -