- మనాలీలో కాఫీ కెఫె
- కంగన అభిరుచులకు అనుగుణంగా కేఫ్
- స్థానికంగా పండే కూరలతో సంప్రదాయ వంటకాలు
- ఈనెల 14న ఓపెన్ కానున్న కేఫ్
బాలీవుడ్ సెన్సేషన్, వివాదాల కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్ ఫుడ్ బిజినెస్ లోకి ఎంటరైంది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో హిమాలయా పర్వతాలకు దగ్గరలో ఓ సరికొత్త కేఫ్ ను కంగనా ఓపెన్ చేస్తోంది. ఈనెల 14న ఈ కేఫ్ కు ముహూర్తంగా నిర్ణయించింది. చిన్నప్పటినుంచి హోటల్ పెట్టాలన్నది తన కోరిక అని అది ఇన్నాళ్లకు తీరుతోందని ఆమె చెబుతోంది. కంగనా కొత్త కేఫ్ వుడెన్ ఫర్నిచర్ తో ఓ ఫైర్ ప్లేస్ తో కళకళలాడుతోంది. హిమాలయాల్లో మాత్రమే దొరికే కూరగాయలతో తయారు చేసిన స్పెషల్ డిషెస్ మాత్రమే తన దగ్గర దొరుకుతాయంటోంది కంగనా. తన కేఫ్ యాంబియన్స్, వెదర్ ఎంతో బాగుంటుందని విజిటర్లు క్యూ కట్టడమే తరువాయని ఊరిస్తోంది.పిజ్జా, పాస్తా, సలాడ్స్, కేకులతో పాటు కొండల దగ్గరుండే వారు చేసుకునే వంటకాలన్నీ తన దగ్గర దొరుకుతాయంటోందామె. కంగనా కేఫ్ లోపలా, బయటా కూడా సీటింగ్ అరేంజ్మంట్లు ఉన్నాయి.వెనకాల హిమాలయాల బ్యాక్ డ్రాప్ కూడా అదిరిపోయేలా ఉంది.
ది మౌంటెన్ స్టోరీ పేరిట వెలుస్తున్న ఈ కేఫ్ తన చిన్ననాటి కల అని ప్రకృతి ఒడిలో హిమలయ పర్వత సానువులలో ఈ కేఫె ఎంతో నేచురల్ గా ఉంటుందని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.రెండు వీడియోలు కూడా అప్ లోడ్ చేసింది.ఎప్పటినుంచో ఫుడ్ బిజినెస్ లోకి ఎంటరవుదామని కంగనా ప్రయత్నిస్తున్నా.. 2023లో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కూడా ఆర్ధిక సమస్యలతో అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ రూపంలో కేఫ్ మొదలు పెట్టింది. త్వరలోనే రెస్టారెంట్ కూడా పెడతానంటో్ంది ఈ బ్యూటీ. ఇప్పటికే బాలివుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఫుడ్ బిజినెస్ లోకి దిగారు. మలైకా అరోరా గోవాలో రెస్టారెంట్ షురూ చేసింది.