27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతి

సీఎంలు చంద్రబాబు నాయడు, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సంతాపం
మాజా పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాథం మృతి చెందారు. నాగర్నూలు పార్లమెంట్ నియోజవకర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా మంద జగన్నాథం ప్రాతినిధ్యం వహించారు. 2018లో న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినేట్ హోదాలో పనిచేశారు. మంద మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మందజగన్నాథంకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కుమార్తె పల్లవి ప్రభుత్వ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమారుడు శ్రీనాథ్ సోషల్ వర్కర్ గా ఉన్నారు. చిన్నకుమారుడు విశ్వనాథ్ డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు.

మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాధం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాధం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.

నాగర్ కర్నూల్ మాజీ ఎంపి మంద జగన్నాథం మృతికి సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన మందా జగన్నాధం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. పేద కుటుంబ నుంచి వచ్చి ఉన్నత చదవులు చదివిన జగన్నాథం… తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎంపిగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ ఎంపీ మందజగన్నాథం మృతి పట్ల డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంద మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని విక్రమార్క అన్నారు.

రాజకీయ రంగ ప్రవేశం…

1996లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసి తొలిసారిగా ఎన్నికయ్యారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా (లోక్‌సభ) ఎన్నికయ్యారు.
1996 – 11వ లోక్‌సభకు (టిడిపి) ఎన్నికయ్యారు.
1999 – 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం) (TDP)
2004 – 14వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యారు (TDP)
2009 – 15వ లోక్‌సభకు (4వ పర్యాయం) తిరిగి ఎన్నికయ్యారు (కాంగ్రెస్)
2014 – TRS పార్టీ నుండి పోటీ చేసి కార్ గుర్తు లో పోలిక ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి వల్ల సల్ప మెజారిటీతో ఓడిపోయారు..
2018 – న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినేట్ హోదాలో నామినేట్ చేయబడింది. (9 జూన్ 2018 – 8 జూన్ 2019)
ఆ తరువాత మరొక్కసారి రెన్యూవల్ చేయబడి రెండవసారి కూడా కొనసాగారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com