29.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఓబుళపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఐదుగురి శిక్ష ఖరారు

  • ఏ1 శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్ధనరెడ్డిలకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష
  • మాజీ మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్
  • మాజీ ఐఏఎస్‌ కృపానందం కూడా నిర్దోషే
  • మొత్తం ఐదుగురికి శిక్ష విధిస్తూ బుధవారం సీబీఐ కోర్టు తుది తీర్పు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎనిమిదొవ నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కృపానందం, తొమ్మిదొవ నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో ఆరొవ నిందితురాలిగా ఉన్న ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్షిని సీబీఐ కోర్టు గతంలోనే నిర్దోషిగా తేల్చింది. ఇదే కేసులో ఏ5గా ఉన్న లింగారెడ్డి విచారణ జరుగుతున్న సమయంలోనే మృతి చెందారు. ఇక ఓయంసీ కేసులో ప్రధమ నిందితుడిగా ఉన్న బీ.వీ.శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్ధన్‌రెడ్డి, ఏ2 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, ఏ7 అలీ ఖాన్లకు సీబీఐ కోర్డు శిక్షలు ఖరారు చేసి ఏడేళ్ళు శిక్ష విధించింది. మైన్స్ శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ కి ఏడేళ్ళ శిక్షతో పాటు పీసీ యాక్ట్ కింద మరో నాలుగు సంవత్సరాలు అదనపు జైలు శిక్షను విధించింది. అయితే తన వయసుతో పాటు తాను చేస్తున్న సామాజిక సేవలను దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్‌ రెడ్డి కోర్టును అభ్యర్ధించాడు. కాగా మీరు యావజ్జీవ శిక్షకు అర్హులని మీకు పది సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదని కోర్టు ప్రశ్నించింది. బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని ఇప్పటికే నాలుగు సంవత్సరాల పైబడి రిమాండ్‌ లో ఉన్నందున తనకు శిక్ష తగ్గించాలని జనార్ధనరెడ్డి వేడుకున్నారు.

దాదాపు 14 సంవత్సరాల తరువాత ఈ రోజు ఓబుళాపురం కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.ఈ కేసులో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అధినేత గాలి జనార్థనరెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు నమోదై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఓబుళాపురం ఇనుప గనుల మైనింగ్‌లో నిబంధనలకు విరుద్దంగా ఓఎంసీ అక్రమ తవ్వకాలు చేసిందనే కారణంతో అక్కడ మైనింగ్‌ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జోఓ నెం 71ని విడుదల చేసింది. అంతే కాకుండా అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై 2009 డిసెంబర్‌ 7వ తేదీన అప్పటి సీయం కొణిజేటి రోశయ్య సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గాలి జనార్ధనరెడ్డితో పాటు అప్పటి మైనింగ్‌ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఓఎంసీ మాజీ ఎండీ బీవీ.శ్రీనివాసురెడ్డి, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ రాజగోపాల్‌, మాజీ ఐఎఎస్‌ అధికారి కృపానందం, గాలి జనార్ధనరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం.అలీఖాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటి ఛార్జిషీట్‌ ని 2011వ సంత్సరంలో కోర్టులో దాఖలు చేసింది సీబీఐ. 3400 పేజీలతో దాఖలు చేసిన ఈ ఛార్జిషీటులో 219 మంది సాక్షులను విచారించి దాదాపు రూ.884 కోట్ల ప్రజాధనం లూఠీ జరిగినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com