ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. చార్‌ధామ్ యాత్రకు బయలుదేరిన పలువురు భక్తులు ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఈ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఉత్తరాఖండ్ రాష్ట్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరకాశీ ప్రాంతంలోని గంగోత్రి వైపు వెళుతున్న ఒక ప్రవేటు హెలీకాఫ్టర్ కూలిపోయింది. గురువారం ఉదయమే ఏడుగురు ప్రయాణికులతో గంగోత్రి వైపు ప్రయాణమవుతున్న హెలీకాఫ్టర్ ఉదయం 9 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ హెలీకాఫ్టర్ కూలిన ఘటన జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలీకాఫ్టర్లో ఏడుగురు ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాత్రికుల్లో ఐదుగురు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహయాక సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఘటనా స్ధలంలో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అలాగే చనిపోయిన వారిలో అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబిక లక్ష్మినారాయణ సోదరి మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీ బావ భాస్కర్ ని రిషీకేష్ ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీ లక్ష్మీనారాయణ రుషీకేష్ బయలుదేరారు.