34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ల్యాండైన మొదటి విమానం.. 104 మంది డిపోర్ట్

భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా తిరిగి వెనక్కి పంపుతోంది. 104 మంది అక్రమవలసదారులతో ఉన్న అమెరికా సీ-17 యుద్ధ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండైంది. మొదట 200 మంది వస్తున్నారని ప్రచారం జరిగినా.. వచ్చిన వారు కేవలం 104 మందే అని అధికారులు తెలిపారు. అయితే మరిన్ని విమానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం డిపోర్ట్ చేసిన వారిలో 73 మంది పురుషులు ఉండగా.. 25 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. అయితే వీరిని భారత్‌లో అరెస్ట్ చేసే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే వీరంతా భారత్‌ను వీడే సమయంలో అన్ని రూల్స్‌ను ఫాలో అయ్యారని.. కానీ విదేశాలకు వెళ్లిన తర్వాతే అక్కడి నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అందుకే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి.

ప్రస్తుతం భారత్‌కు చేరుకున్న  వలసదారుల వద్ద ఎలాంటి పాస్‌పోర్టులు లేవని తెలుస్తోంది. వీరిని బయోమెట్రిక్‌ ఆధారంగా గుర్తించనున్నారు. నిజానికి మొదట 200 మంది అక్రమవలసదారులను తీసుకొస్తున్నట్టు ప్రచారం జరిగినా.. కేవలం 104 మంది మాత్రమే వచ్చారు. ప్రస్తుతం భారత్‌కు చేరుకున్న వలసదారులను టెక్సాస్‌ నుంచి తరలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com