మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐదంస్తుల భవనంలో పైన ఉన్న బార్ అండ్ రెంస్టారెంట్లో అగ్నిప్రమారం చోటుచేసుకుంది. పైన ఐదో అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం కింద వరకూ వ్యాపించడంతో ఆదే భవనంలో ఉన్న పలు సాఫ్ట్‌వేర్ కంపనీలకు కూడా భారీగా మంటలు వ్యాపించాయి. సాఫ్ట్ వేర్ కార్యాలయంలో భారీ స్ధాయిలో కంప్యూటర్లు, ప్రింటర్లు ఉండటంతో అవి అంటుకుని మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అగ్నికి ఆహుతి అవుతుండటంతో పరిసరాల్లో నల్లటి దట్టమైన పొగ వ్యాపించింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలను చూసి బిల్డింగ్ లో ఉన్న ఉద్యోగస్తులందరూ బయటకు పరుగులు తీశారు. ఐదు అంతస్తుల్లో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్ధలానికి చేరకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లో చిక్కుకున్న ఉద్యోగస్తులందరినీ బయటకు పంపి ఆరు ఫయర్ ఇంజన్ల సహాయంతో మంటలను నియంత్రిస్తున్నారు.