34.5 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

చెలామణీలోకి రూ.500 నకిలీ నోట్లు.. పారా హుషార్!!

  • సర్క్యులేషన్ లోకి నకిలీ రూ.500 నోట్లు
  • పేపర్ క్వాలిటీ, ప్రింటింగ్‌ అన్నీసేమ్ టు సేమ్
  • కేవలం స్పెల్లింగ్ లో చిన్నతేడా
  • రిజర్వు బ్యాంకు స్పెల్లింగ్ లో అక్షరం తేడా
  • ఇ కి బదులు ఎ వాడుతున్న దొంగ నోట్లు
  • బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలకు కేంద్రం సూచన
  • లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి..

నకిలీ నోట్ల చెలామణీపై కేంద్రం అప్రమత్తం చేసింది. రూ.500 నోటు నకిలీది సర్క్యులేషన్లో ఉందని అందరూ దానిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రహోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కీలక ఆర్థిక వ్యవస్థలైన డీఆర్‌ఐ, ఎఫ్‌ యుఐ, సీబీఐ, ఎన్‌ఐఏ,సెబీ సంస్థలు లావాదేవీల విషయంలో అలెర్ట్ గా ఉండాలని హోం శాఖ సూచించింది.నకిలీ నోట్లు ప్రింటింగ్‌, నోటు నాణ్యత, తయారీ అంతా ఒకే రకంగా ఉండడం వల్ల నకిలీ వాటిని గుర్తించడం కష్టమని నగదు వ్యవహారాలు డీల్ చేసే వారు అలెర్ట్ గా చూసుకోవాలని తెలిపింది.

గుర్తించడం ఎలా?

నకిలీ నోట్లు అసలు 500 నోటునే పోలి ఉన్నాచాలా చిన్న తేడాలున్నాయి. ఒక చిన్న స్పెల్లింగ్‌ తప్పుతో వాటిని గుర్తించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా స్పెల్లింగ్‌ లో ఇ కి బదులు ఏ అని నకిలీ నోట్లలో ఉంటుంది.వినియోగ దారులు వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలు జరిపే ఆర్థిక సంస్థలు బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఈ నోట్లను పరిశీలించి తీసుకోవాలని ఇప్పటికే మార్కెట్ లో పెద్ద ఎత్తున ఈ కరెన్సీ దిగిందని కేంద్రం సూచిస్తోంది. ఇందుకు సంబంధించి నకిలీ నోటును కూడా కేంద్రం చూపింది.ఇప్పటికే ఎన్ని నకిలీ నోట్లు చెలామణీలోకి దిగాయో అంచనా వేయడం కష్టమని ఈ నేరాన్ని దర్యాప్తు జరుపుతున్న అధికారి అన్నారు.కొందరు ఇప్పటికే ఈ నకిలీ నోట్లను బ్యాంకులకు తీసుకొచ్చారని, అయితే అసలు 500 నోట్లకన్నా నకిలీ నోట్ల సంఖ్య ఎక్కువగానే ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com