27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

Live Video

spot_img

బాణసంచా కర్మాగారంలో పేలుడు… 18 మంది మృతి

ఒక బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 18 మంది మృతి చెందిన సంఘటన గుజరాత్‌ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం బనస్కాంత పరిధిలోని దీసా జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగడం వల్ల ఏర్పడిన అగ్ని ప్రమాదంలో 18 మంది మరణించినట్లు ప్రాధమిక సమాచారం. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకి చేరుకుని మంటలను ఆర్పారు. అలాగే శిధిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో ఉన్న ఐదు మందిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకుని మరో 18 మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే క్షతగాత్రులైన ఐదు మందిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఫ్యాకర్టీ యజమాని పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com