27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ముదురుతున్న హార్వర్డ్ -ట్రంప్‌ వివాదం

  • ఇప్పటికే నిధులు రద్దుచేసిన ట్రంప్‌
  • వర్సిటీని చెప్పు చేతల్లోకి తీసుకునే ప్రయత్నం
  • అమెరికా పాలసీలకు అనుగుణంగా నడపాలని పట్టు
  • విద్యాసంస్థలపై రాజకీయ పెత్తనమేంటంటున్న ప్రొఫెసర్లు
  • రెండు ఫెడరల్‌ గ్రాంట్ల రద్దు. రిసెర్చ్ ఫండ్ నిలిపివేత
  • అమెరికాను ప్రేమించే వారికే సీటు అంటున్న ట్రంప్‌
  • హార్వర్డ్ పై ఆంక్షలు విధించే యోచనలో ట్రంప్‌
  • విద్యార్ధులు ఉద్యమాలు చేయడమేంటని మండిపాటు
  • యూదు ద్వేషం కొనసాగితే సహించేది లేదని ఆక్రోశం
  • ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగబోమంటున్న యాజమాన్యం..
  • అదే బాటలో మరో మూడు వర్సిటీలు

ఇమ్మిగ్రంట్లపై కక్ష గట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ హార్వర్డ్ యూనివర్సిటీపై మరింత పట్టు బిగిస్తున్నారు. వర్సిటీలో ఉన్న ఐవీ లీగ్‌ ఇనిస్టిట్యూషన్ నిర్వహణ తీరును ఒక అవమానంగా ఆయన అభివర్ణించారు. వర్సిటీ నిధులపైనా, టాక్స్ హోదా, విదేశీ విద్యార్ధులను హ్యాండిల్‌ చేస్తున్న తీరు అన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయని ఫెడరల్‌ ఎజెన్సీస్ ఆరోపించాయి. ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ హార్వర్డ్ ఎక్కడా అమెరికా విలువలకు ప్రతిబింబంగా లేదని యూదులకు వ్యతిరేకంగా అత్యంత అవమానకర విధంగా వర్సిటీ నిర్వహణ జరుగుతోందని ధ్వజమెత్తారు.వర్సిటీకి ఇప్పటి వరకూ ఉన్న పన్ను మినహాయింపు హోదాను తొలగించాలని ట్రంప్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. హార్వర్డ్ పై తుది నిర్ణయం తీసుకోలేదని, లాయర్లు ఆ సంగతి పర్యవేక్షిస్తున్నారని, వర్సిటీకి అనుబంధంగాఉన్న స్కూల్స్ ని కూడా స్టడీ చేయాల్సి ఉందని ట్రంప్ అన్నారు. ఇతర యూనివర్సిటీలైన కొలంబియా హార్వర్డ్, ప్రిన్స్ టన్ లలో కూడా నిర్వహణ విధానం అత్యంత దారుణంగా ఉందని పరమ చెత్తగా ఉందని త్వరలోనే వాటిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఫెడరల్‌ గ్రాంట్ల రద్దు.. రిసెర్చ్ ఫండ్ నిలిపివేత

హార్వర్డ్ లో చదువుతున్న విదేశీ విద్యార్ధులు అక్రమ కార్యకలాపాలు, నిషేధిత, హింసాత్మక కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల రీత్యా వర్సిటీకి చెందిన రెండు ఫెడరల్ గ్రాంట్లను 2.7 మిలియన్ అమెరికన్ డాలర్లను రద్దు చేయగా, మరో రెండు బిలియన్ డాలర్ల నిధులను స్తంభింప చేశారు. రిసెర్చ్, ఇతర అకడమిక్ కార్యకలాపాల నిర్వహణకు ఉద్దేశించిన ఈ నిధులను ఫ్రీజ్ చేశారు.

పురాతన, సంపన్న వర్సిటీ

హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలోకే అత్యంత పురాతనమైన, సంపన్న యూనివర్సిటీ. విద్యార్ధులను ఉద్యమాల్లో పాల్గొనకుండా కట్టడి చేయమని, అడ్మిషన్ పాలసీని పునర్నిర్వచించమని, అమెరికా సిద్ధాంతాలు, విలువలతో మమేకమయ్యే అంతర్జాతీయ విద్యార్ధులను మాత్రమే అనుమతించమని ఫెడరల్‌ ప్రభుత్వం చేస్తున్నకట్టడిని ఆ వర్సిటీ యాజమాన్యం తిరస్కరించింది. దాంతో హార్వర్డ్ కు నిధులను ఇవ్వకుండా రద్దు చేసింది ట్రంప్ ప్రభుత్వం.

ఒత్తిళ్లు భరించేది లేదు… హార్వర్డ్ యాజమాన్యం

వర్సిటీ యాజమాన్యానికి, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాజకీయ కారణాలతో వర్సిటీని కట్టడి చేస్తే సహించేది లేదని, వర్సిటీ నియమ నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని హార్వర్డ్ అధ్యక్షుడు అలెన్ గార్బర్ ప్రకటించారు.
అంతకుముందు ఛారిటీతో నడిచే విద్యాసంస్థలు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో రాశారు. హార్వర్డ్ పై దర్యాప్తు జరిపమని ఆదేశించే హక్కులు నేరుగా అధ్యక్షునికి లేకపోయినా, వర్సిటీలో పన్నుల హోదాను ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు చట్ట వ్యతిరేకమని, హార్వర్డ్ మాజీ అధ్యక్షుడు లారీ సమ్మర్స్ విమర్శించారు.

ట్రంప్ తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తగా విదేశీ విద్యార్ధులు తమ చదువులకు ఎక్కడ ఆటంకాలు కలుగుతాయో అని భయపడుతున్నారు. అసలు విదేశీ విద్యార్దులు లేకుండా హార్వర్డ్ ను ఊహించుకోలేమని వర్సిటీ తన భిన్నత్వాన్ని కోల్పోతుందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.
హార్వర్డ్ ను ట్రంప్ టార్గెట్ చేశారన్నది స్పష్టం. ఇదే వర్సిటీని ఫాలో అవుతున్న కొలంబియా వర్సిటీ కూడా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయడం లేదు. ఇది ఒక్క హార్వర్డ్ సమస్యే కాదు.. పెరుగుతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా అసలు విద్యా సంస్థల స్వేచ్ఛ, స్వతంత్రాలు హరించుకుపోతున్నాయన్న భావన చాలా మంది టీచింగ్‌ స్టాఫ్ లో నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com