22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

బట్లరు అస్త్రసన్యాసం.. ఇంగ్లండ్ కొత్త సారథి ఎవరు?

వరుస ఓటములు.. కనీసం సెమీస్‌కు చేరని టీమ్.. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో ఇంగ్లీష్‌ క్రికెట్‌లో ఓ చిన్న అలజడి మొదలైనట్టు కనిపిస్తోంది. అంతకుముందు టీమ్ ఇండియా టూర్‌లో దారుణంగా విఫలమైంది ఇంగ్లండ్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్ఘాన్‌ను కూడా ఓడించలేక చతికిలపడిపోయింది. దీంతో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు బట్లర్. సౌతాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ తర్వాత తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు.

లాస్ట్‌వీక్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ ఆసీస్‌ ఊహించని రీతిలో ఆడి.. 351 పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసింది. ఆ తర్వాత లాహోర్ వేదికా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఓడింది. అంతకుముందు టీమ్ ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 3-0తో, టీ20లో 4-1తో ఓడిపోయింది. ఇలా వరుస ఓటములతో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ రిటైర్ అయినప్పుడు బట్లర్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. మరిప్పుడు బట్లరు తర్వాత ఎవరూ క్యాప్టెన్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌కు హ్యారీ బ్రూక్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం అతనే కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com