జాట్ మూవీ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడింది. క్రిస్టియన్స్ డిమాండ్‌కు మూవీ మేకర్స్ తలొంచారు. మూవీలో ఉన్న వివాదస్పద సీన్స్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. సన్నీ డియోల్ హీరోగా వచ్చింది జాట్ మూవీ.ఈ మూవీలో తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న సీన్స్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశాయి క్రిస్టియన్ సంఘాలు. లేదంటే మూవీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ వివాదంపై పోలీసులు FIR కూడా నమోదు చేశారు. సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడాతో పాటు మరో ముగ్గురికి కేసులు నమోదయ్యాయి. దీంతో మేకర్స్ దిగి వచ్చారు. ఆ సీన్స్‌ను సినిమా నుండి తొలగించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏ మతాన్నీ కించపరచడం మా ఉద్దేశం కాదని.. క్షమించాలని కోరింది మూవీ టీమ్.
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది జాట్. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్‌లో ఏసుక్రీస్తు శిలువ ఉందంటూ క్రిస్టియన్స్ ఆగ్రహించారు. చాలామంది క్రిస్టియన్స్ కలిసి ఈ మూవీ హీరో, డైరెక్టర్, నిర్మాతపై ఫిర్యాదు చేశారు.
ఎవరి మతాన్ని కించపరచాలి అన్నది తమ ఉద్దేశ్యం కాదని.. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే దానికి చింతిస్తున్నామంటూ ప్రకటించింది. సినిమా నుంచి ఆ సీన్‌ను డిలీట్ చేశామన్నారు. ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వారికి మేము క్షమాపణ చెప్తున్నామంటూ మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది.
జాట్ మూవీ మేకర్స్ దిగి రావడంతో క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు కాస్త కుదుటపడ్డారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టైంది.