అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన విషయాన్ని ప్రకటించారు. ఈ వారంలోనే ఇజ్రాయెల్-హమాస్ వార్‌కు ఎండ్ కార్డ్ పడనుందని తెలిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని తేల్చేశారు ట్రంప్. అంతేకాదు ఈ ఒప్పందం కుదరాల్సిందే.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హమాస్‌కు డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్‌లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు ఆయన. దీనిపైనే ట్రంప్ స్పందించారు. డీల్ కుదరనుందని కాదు.. కుదరాల్సిందే అని చెప్పారు. అంతేకాదు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేనాటికి హమాస్ చెరలో బంధీలుగా ఉన్న బంధీలను రిలీజ్ చేయాల్సిందే అన్నారు. లేదంటే హమాస్ ఇంతకుముందు ఎన్నడూ చూడని విపరీత పరిస్థితులను చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు కూడా ముందుడుగు పడుతున్నట్టు తెలుస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొన్ని అంశాలపై ఇరువర్గలు అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. హమాస్ చెరలో ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, గాయపడిన వారు ఉండాలని కండిషన్ పెట్టింది ఇజ్రాయెల్. దీనికి హమాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 150-200 మంది హమాస్ ఫైటర్లు, పాలస్తీనా ప్రజలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది హమాస్. దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది.
హమాస్ చేస్తున్న ఒక డిమాండ్‌కు మాత్రం నో చెబుతోంది ఇజ్రాయెల్. ఇటీవల హమాస్ కీలక లీడర్ యాహ్యా సిన్వర్‌ను మట్టు పెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. అతని మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి మాత్రం ఖరాఖండిగా నో చెబుతోంది ఇజ్రాయెల్. అంతేకాదు ఇజ్రాయెల్ చెరలో ఉన్న హమాస్ కీలక నేతలను కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన 16 రోజుల తర్వాత రెండో స్టేజ్ మొదలు కానుంది. అయితే అప్పుడు ఎంత మందిని రిలీజ్ చేయాలనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.
హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి మొత్తం 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా చేసుకుంది. వీరిలో ఇప్పటి వరకు 94 మందిని విడిపించింది ఇజ్రాయెల్. సెర్చ్ ఆపరేషన్‌లో మరో 34 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక మిగతావారిని విడిపించేందుకు కృషి చేస్తోంది.