హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతోంది. ఇప్పటికే అనేక విమర్శలు, వరుస ఓటములతో టీమ్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతుంది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ముందుగా హెడ్ కోచ్ గంభీర్ పనితీరుపై ఫోకస్ చేసింది. అతను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కోంటి టీమ్ ఇండియా. దీంతో గంభీర్‌కు ఛాంపియన్స్ ట్రోఫి ఆఖరి అవకాశంగా మారనుంది. ఇదే దారుణ ఆటతీరును కూడా CTలో కొనసాగిస్తే.. ఆ తర్వాత కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తొలగించాలని బీసీసీఐ భావిస్తుందని తెలుస్తోంది.
లాస్ట్ ఇయర్ జులైలో టీమిండియా కోచ్ బాధ్యతలను చేపట్టాడు గంభీర్. నిజానికి 2027 వరకు అతను కోచ్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై బీసీసీఐతో అగ్రిమెంట్ కూడా కుదిరింది. కానీ గంభీర్ మార్క్ మాత్రం టీమ్‌పై కనిపించడం లేదు. గంభీర్ నేతృత్వంలో టీమ్ ఇండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అందులో ఆరింటిలో ఓడింది. సొంత గడ్డపై కివీస్ వైట్ వాష్ చేసింది. BGT సిరీస్ పోయింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా ఓడింది. ఇవి కాకుండా డ్రెస్సింగ్ రూమ్ గొడవలు బయటికి రావడం.. దూకుడుగా మాట్లాడటం ఇవన్ని కూడా గంభీర్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి.
ముఖ్యంగా టీమ్‌లో సూపర్ స్టార్ కల్చర్‌ను తీసేయాలన్న పట్టుదలలో ఉన్నాడు గంభీర్. నిజానికి మ్యాచ్‌లు గెలుస్తూ ఈ విషయాలపై ఫోకస్ చేస్తే బాగుండేది. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి వీటిపైనే ఫోకస్ చేయడం కూడా విమర్శలకు కారణమవుతోంది. ఈ విషయాలన్ని గమనించింది కాబట్టే గంభీర్‌ను కొనసాగించాలా? వద్దా? అనే డైలమాకు వచ్చేసింది బీసీసీఐ. అందుకే అతనికి ఆఖరి అవకాశంగా ఛాంపియన్స్ ట్రోఫీని ఉంచింది.
నిజానికి హెడ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఫస్ట్ చాయిస్ కూడా గంభీర్ కాదనే ప్రచారం జరిగింది. వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావించింది. అతడిని సంప్రదించగా సున్నితంగా తిరస్కరించడంతో గంభీర్‌పై ఫోకస్ చేసింది బీసీసీఐ.