ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల గట్టి ఎదురు దెబ్ణ తగిలింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
మృతుల్లో నర్సంపేట ఏరియా దళకమండర్ బద్రు, దళ సభ్యులు మల్లయ్య, కిషోర్, రమేష్, ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, జై సింగ్ మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆధునిక ఆయోదాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.
మావోయిస్టులు ఇటీవల వాజేడులో ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు అమాయకులను చంపారని ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ వెల్లడించారు. ఈ తరుణంలో జిల్లాలో గస్తీ పెంచామని…. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందానికి ఈ ఉదయం మావోయిస్టులు ఎదురుపడ్డారని, పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారని ఎస్పీ శబరీశ్ వివరించారు. లొంగిపోవాలని హెచ్చరించినా కాల్పులు ఆపలేదని… దాంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.