హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్ టిబెట్ మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేపాల్ నుంచి టిబెట్ వైపు భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీని ప్రభావం ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ తోపాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కనిపించింది.
రిక్టర్ స్కేల్ పై 71. తీవ్రతగా నమోదయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈరోజు(మంగళవారం) వేకువ జామున భూకంపం సంభవించిందని… నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లోని లబుచేకకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీక్రతం అయినట్టు గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు రావల్సి ఉంది. భారత్, నేపాల్ దేశాల్లో భూమి కంపించడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.