ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో భారత్‌లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – NCS వెల్లడించింది.
ఈ భూకంపం తెల్లవారు జామున 4.43 నిమిషాలకు సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూపూర్ ప్రాంతంలో, భూమికి 75 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.
భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే, జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఉదయం 5:14 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 2.4గా నమోదైంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉందని సిస్మాలజీ కేంద్రం తెలిపింది.