RCB తో అనుబంధంపై డి ఎస్ పి బావోద్వేగంతో ఓ నోట్ విడుదల చేశాడు. ఈ బంధం ఏడేళ్ల నాటిది…ఆర్ సీబీలో సమయాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నా హృదయం ప్రేమ, కృతజ్ఞత భావోద్వేగంతో నిండిపోతుంది. నేను మొదటిసారి ఆర్‌సీబీ జెర్సీని ధరించిన రోజు, ఇంతటి బంధాన్ని ఏర్పరుచుకుంటామని ఎప్పుడూ ఊహించలేదు. ఆర్‌సీబీ తరఫున వేసిన మొదటి బంతి నుంచి తీసిన ప్రతి వికెట్, ఆడిన ప్రతి మ్యాచ్, మీతో పంచుకున్న ప్రతి క్షణం, ప్రయాణం ఎంతో ప్రత్యేకం. హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ అన్నింటిలోనూ ఒక విషయం స్థిరంగా ఉంది. అదే.. మీ తిరుగులేని మద్దతు. ఆర్‌సీబీ కేవలం ఫ్రాంచైజీ మాత్రమే కాదు.. నా సొంత ఇల్లులా భావించే కుటుంబం. మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టాండ్‌లలోని మీ కేరింతలు, సోషల్ మీడియాలో మీ సందేశాలు, మీ స్థిరమైన నమ్మకం ఇన్నాళ్లు నన్ను ముందుకు నడిపించాయి. ఆర్‌సీబీకి అభిమానులే ఆత్మ. మీరు ఇచ్చే ప్రేమ, మీరు చూపించే విశ్వాసం సాటిలేనివి. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ మీ కలలు, ఆశల బరువును నేను అనుభవించాను. మీరు నా వెనుక ఉన్నారని నాకు తెలుసు కాబట్టి.. నేను ఇన్నాళ్లు అద్భుతంగా రాణించాను. మీకు ఆనందాన్ని పంచాను.
మేము సరిగ్గా ఆడని సమయంలో మీ కళ్లలో కన్నీళ్లను చూశాను. అదే మేము బాగా ఆడిన సందర్భంలో మీ వేడుకలను చూశాను. ప్రపంచంలో మీలాంటి అభిమానులు ఎక్కడా ఉండరు. మీ ప్రేమ, మీ అంకితభావం, మీ విధేయత నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.
ఇప్పుడు నా కెరీర్‌లో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టినప్పటికీ, నా హృదయంలో ఆర్‌సీబీ ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది వీడ్కోలు కాదు.. ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు.. అంటూ ముగించాడు సిరాజ్.
మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన సిరాజ్.. 2018లో ఆర్‌సీబీ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రీసెంట్ వేలంలో కనీసం RTMను కూడా ఉపయోగించలేదు RCB మేనేజ్‌మెంట్. దీంతో 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో నెక్ట్స్ సీజన్ నుంచి కొత్త జర్సీలో కనిపించనున్నాడు సిరాజ్. అయితే RCBని వీడుతూ సిరాజ్ పెట్టిన ఈ పోస్ట్ RCB ఫ్యాన్స్‌లో అతడిపై మరింత అభిమానాన్ని పెంచింది.