25.6 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

డంకీ రూట్‌ లో డాలర్ వేట…

  • డంకీ రూట్‌ ద్వారానే అక్రమ వలసలు
  • భయానక ప్రయాణం కూడా భరిస్తూ…
  • ప్రాణాలకు తెగించి… పరాయి గడ్డకు
  • ధన, మాన, ప్రాణాలు ఫణంగా పెట్టి
  • తీరా పట్టుబడితే చీకటి గుయ్యారాల్లోకి
  • అయినా వదలని అమెరికా క్రేజ్
  • 2023లో ఈ రూట్‌ లో వెళ్లినది 5 లక్షల మంది
  • 2020తో పోలిస్తే ఇది రెట్టింపు…

డంకీ రూట్‌ అంటే ఏదైనా దేశంలోకి అక్రమ మార్గాల ద్వారా ప్రవేశించడం. అనేక దేశాల సరిహద్దులు దాటుకుంటూ, అక్కడక్కడ నిర్జన ప్రదేశాల్లో ఆగుతూ, చిట్టడవులను క్రూరమృగాల మధ్య నుంచి దాటుకుంటూ చేసే జర్నీ. దీనికి తోడు డ్రగ్‌ స్మగ్లర్లు, మాఫియాలు… చాలా చాలా కష్టతరమైన జర్నీ. కఠినమైన ప్రయాణం… ఒక విధంగా దొంగ రూట్ లో ప్రయాణించడం. దీనికి కొందరు ఏజెంట్లు ఉంటారు. వారే తీసుకు వెడతారు.దీనికోసం లక్షలు లక్షలు వసూళ్లు చేస్తారు.

అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారిలో ఎక్కువ మంది వెళ్ళేది… ఈ డంకీ రూట్ల లోనే..సింపుల్‌ గా చెప్పాలంటే గాడిద మార్గం. ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద. గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది. ఎందుకంటే వెంట వుండే బ్యాగులు మోసుకుంటూ, ఫుడ్‌ నిల్వలు పట్టుకుని వెళ్లాలి. అమెరికాకు అనేక మార్గాల్లో ఇలా అక్రమంగా చొరబడొచ్చు. సక్రమంగా వీసా రాని వారు ఎంచుకునే అక్రమ మార్గమే ఇది.

దరియెన్ రూట్ లో డేంజర్ జర్నీ

ఇందులో ఒకటి…  దరియెన్ ఖాళీ స్థలం. ఇది పనామా… కొలంబియాల మధ్య వుంది. అతి భయంకరమయిన కీకారణ్యం… చిత్తడి నేల, పొడవు 97 కిలోమీటర్లు. విష పూరిత పాములు, చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి. వీటి బారిన పడితే ఇక అడుగుముందుకు వేసే అవసరమే లేదు. పనామా అడవులన్నీ భారీ వర్షపాతం నమోదయ్యేవే. అక్కడ ఎప్పుడూ వర్షం.. దానితో పాటే ఎండ.. వేడి.. చెమటలు కారి పోతాయి. ఇలాంటి చోట ప్రయాణం ఊహించుకోండి.. ఎంత నరకంగా ఉంటుందో.

మాఫియా గ్యాంగుల బారిన పడితే…

ఇదంతా ఒక ఎత్తయితే మాఫియా గ్యాంగులను డీల్‌ చేయడం మరో ఎత్తు. డ్రగ్‌ మాఫియా ముఠా బారిన పొరపాటున పడితే అంతే సంగతులు. వారు చాలా క్రూరంగా వ్యవహరిస్తారు. ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు . అందుకే ఈ మార్గం లో వెళ్లేవారికి ఏజెంట్స్  ముందుగానే కండోమ్‌లు ఇస్తారు.  డ్రగ్ కేటుగాళ్లతో  సంభోగానికి  ఒప్పుకోవాలి. లేకపోతే చిత్ర హింసలు పెట్టి  రేప్ చేసి చంపేస్తారు. ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పేసుకుంటే మనకి ప్రాణం దక్కుతుంది. విశృంఖల శృంగారానికి అలవాటు పడే ఈ గ్యాంగుల వల్ల ఎయిడ్స్ సులభంగా వ్యాపిస్తుంది. అందుకే వెళ్లే వారికి ఏజెంట్లు ముందుగానే కండోమ్‌లు ఇస్తారు. ఈ వ్యాధి బారిన పడకుండా. ఇంత చేసినా వారి నుంచి దోపిడీ ఉండదంటే ఆ గ్యారంటీ లేదు. వారు  అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి .

ఆహారం దొరకదు..

రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు. వెంట తెచ్చుకున్న ఫుడ్‌ దారిలోనే అయిపోతే ఇక బ్రెడ్ ముక్క, బిస్కట్లే గతి. తాగు నీరు కూడా పెద్దగా అందుబాటులో ఉండదు. దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది .

కేవలం 97 కిలోమీటర్ల ప్రయాణానికి 15రోజులు ఎందుకూ అనుకోవచ్చు కొండలు గుట్టలు… బురద… చెట్లు చేమలు.. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు  వెయ్యాలంటే నరకం. ఈ శారీరక, మానసిక ఆందోళనలను తట్టుకుంటూ అడుగేయాలంటే మరి ఆ మాత్రం టైమ్ పడుతుంది. మధ్యలో ఏదైనా వ్యాధి బారిన, అనారోగ్యం బారినా పడితే ఇక అంతే సంగతులు.. సిక్ అయిన వారిని అక్కడ వదిలేయడమే.. మిగతా బృందం ముందుకు ప్రొసీడ్ అయిపోతుంది. మనలా  ఆకులూ, అలములూ తిని బతికే పరిస్థితి అక్కడ ఉండదు. అందుకే అనారోగ్యం బారిన పడినా, ఆహారం నిల్వలు నిండుకున్నా ఇక జర్నీ ఆగిపోయినట్లే.. అక్కడ ప్రాణాలు వదిలేయడమే. దాదాపు ఈ వంద కిలోమీటర్ల ప్రయాణంలో ఎన్నో అస్తిపంజరాలు మనకు కనిపిస్తాయి. కొన్ని శవాలు కూడా కనిపిస్తాయి. అన్నీ దాటుకుని వెళ్లాలి. ఎందుకంటే వాళ్లంతా ఇలా బయల్దేరి మధ్యలో గుటుక్కుమన్నవారే.

అయినా ఆగని అమెరికా పిచ్చి

ఇన్ని అగచాట్లు పడి అమెరికాలోకి అడుగు పెట్టాక  అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కంట పడితే ఇక చీకటి గుయ్యారాల్లా ఉండే జైలుకే తరలింపు. పోనీ అన్నీ దాటుకుని సురక్షితంగా అక్కడకు చేరినా తీరా వీరు చేసే పనులేంటి.. చిన్న చిన్న పనులు.. ఆత్మ గౌరవం చంపుకుని  గేదెల కాపరులు, పొలాల్లో కూలీ పని, డైరీ ఫామ్ లో ఆవులు, గేదెల బాగోగులు చూడటం, పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్లు, తోటలు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్ ఇలాంటి వాటిలో పనివారిగా చేరడమే. అయినా అమెరికా అంటే మనకి క్రేజ్ పోదు.. 2023లో ఇలాంటి దొంగ రూట్ల ద్వారా అమెరికాకు వెళ్లిన వారెంతమందో తెలుసా? అక్షరాలా ఐదు లక్షలు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 2022లో వెళ్లిన వారికంటే ఇది డబుల్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com