28.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

నితీష్‌ రెడ్డి కథేంటో తెలుసా? ముత్యాలరెడ్డి త్యాగం ఏంటో తెలుసా?

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిపోవడంతో ఒక్కసారిగా నేషన్ వైడ్‌గా మాత్రమే కాదు.. వరల్డ్‌ వైడ్‌గా డిస్కషన్‌ కారణమయ్యాడు నితీష్‌ రెడ్డి. టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు.. 8వ స్థానంలో వచ్చి దుమ్ముదులిపాడు కాబట్టి ఈ సెంచరీ స్పెషల్. దీంతో నితీష్‌ రెడ్డి ఎవరు? ఎక్కడి వారు? ఏ ఊరు? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అనే దానిపై సెర్చ్ చేయడం పెరిగింది. మీలో కూడా చాలా మందికి ఈ ప్రశ్నలు వచ్చే ఉంటాయి. చదవడం ఇలానే కంటిన్యూ చేస్తే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవచ్చు.

నితీష్‌ది ఏపీలోని వైజాగ్. తండ్రి పేరు ముత్యాల రెడ్డి. హిందూస్థాన్‌ జింక్‌లో పనిచేసేవాడు. నితీష్‌ ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్‌ ఆడుతుండేవాడు నితీష్‌. హిందూస్థాన్ జింక్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడుతూ అప్పటి నుంచే అందరి నుంచి ప్రశంసలు అందుకునేవాడు. అయితే నితీష్‌ది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి కుటుంబానికి ఆధారం ముత్యాలరెడ్డి ఉద్యోగం. ఇలా క్రికెట్‌లో బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ముత్యాలరెడ్డికి ఓ షాక్‌ తగిలింది. అతడిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. దీంతో కొడుకు కోసం ఆ ట్రాన్స్‌ఫర్‌ను క్యాన్సిల్ చేసుకోవడమే కాదు.. ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశారు. కొడుకు నితీష్ కేరియర్ కోసం తండ్రి చేసిన త్యాగం ఇది. బంధువులు కొప్పడినా.. స్నేహితులు వారించినా కొడుకుపై ఉన్న నమ్మకంతో అతను తీసుకున్న సంచలన నిర్ణయం ఇది.

మొదట్లో వైజాగ్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ రెడ్డి.. మాజీ ఛీప్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో కడపలో ఆంధ్రాక్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడే రాటుదేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనింగ్ చేసే నితీష్ రెడ్డి మీడియా పేసర్‌గా సత్తా చాటాడు. ఇండియన్ ఆల్ రౌండర్ అవ్వాలన్నదే తన ఆశయం. ఇండియా అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు.

ఇలా డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తున్న నితీష్‌ను సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం అతని లైఫ్‌లో ఓ టర్న్‌ అని చెప్పాలి. అయితే మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాపలి. ఐపీఎల్ 2023 సీజన్‌లో క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్.. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌లో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే దుమ్ము దులిపేశాడు. ఏకంగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు.

అదే జోష్‌తో టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సత్తా చాటుకున్నాడు. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతూ టీమిండియాలో కీలక టీమ్ మెంబర్స్‌లో ఒకడిగా మారడం ఖాయమనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ముత్యాలరెడ్డి త్యాగం అస్సలు వృథా కాలేదని ప్రూవ్ అయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com