36.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

ఎక్స్‌ సేవల్లో అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ (ఎక్స్‌) సేవలు సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయాయి. సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. లాగిన్‌ అయినా యాక్సిస్‌ చేయలేక యూజర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్నారు. దాదాపు అరగంట నుంచి ఎక్స్‌ సేవలు స్తంభించిపోయాయి. ఎక్స్‌ సైట్‌ను ఓపెన్‌ చేయగా.. స్క్రీన్‌పై ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగెయిన్‌’ అన్న సందేశం వస్తోంది.

డౌన్‌డిటెక్టర్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లో 2 వేల మంది, అమెరికాలో 18,000, యూకేలో 10,000 మంది ఈ సమస్య ఎదుర్కొన్నారు. ఎక్స్‌ అంతరాయానికి గల కారణాలు తెలియరాలేదు. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు.

కొద్దిరోజులుగా ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ఎక్స్‌ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్‌ కాకపోవడం, ట్వీట్స్‌ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తాయి. ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వచ్చాక ఎక్స్‌ తరచు వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com