32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఇండియా అలయెన్స్ లో లుకలకలు

  • కాంగ్రెస్ ను కూటమి నుంచి వెలి వేయండి
  • ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఆక్రోశం

ఢిల్లీ ఎన్నికల వేళ ఇండియా బ్లాక్ లో లుకలుకలు పతాక స్థాయికి వెళ్లాయి. కాంగ్రెస్ ను కూటమినుంచి తొలగించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బాహాటంగా కూటమి నేతలకు అపీల్ చేస్తామని బెదిరింపులకు దిగింది.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ను దేశద్రోహి అంటూ కాంగ్రెస్ నేతలే విమర్శలు చేయడం ఆప్ కన్వీనర్ కు కోపం తెప్పించింది. కూటమిలో ఉండాలంటే కాంగ్రెస్ వద్దు అంటూ ఆయన ఇతర పక్షాలకు ఝలక్  ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మేకన్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రకటనలివ్వడం రెండు పార్టీ లమధ్య చిచ్చు పెట్టింది.   మేకన్ ఆప్ ను పదే పదే కించపరుస్తున్నారని కేజ్రీవాల్ సన్నిహితు లదగ్గర ధ్వజమత్తుతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకోసం బిజేపీ, కాంగ్రెస్ కలిసిపని చేస్తున్నాయని ఇది కూటమి ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని అరవింద్ ఆరోపిస్తున్నారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. ఒకరికొకరు ప్రచారం కూడా చేసుకున్నాయి. కాంగ్రెస్ నేతల గెలుపు కోసం అరవింద్ అనేక సభల్లో  వారికి ఓటేయాలని విజ్నప్తి చేశారు.అంతేకాదు హర్యానా, లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులకు అరవింద్ ప్రచారం చేశారు..కూటమి గెలుపుకోసం కలుపుకుపోయారు. కానీ కాంగ్రెస్  సహకారం మాత్రం అంతంత మాత్రంగా ఉందంటోంది ఆప్..అయితే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ స్థానాలను బీజేపి ఎగరేసుకుపోయింది. దాంతో  రెండు పార్టీలమధ్య లుకలకలు  బయటపడ్డాయి.అవి ఏ స్థాయికి వెళ్లాయంటే బీజేపి గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోందని ఆరోపించేంతలా..

పార్లమెంటులో కూడా ఇండియా కూటమి ఐక్యతలో భాగంగా కాంగ్రెస్ చర్యలను గతంలో కేజ్రీవాల్ సమర్ధించారు. కానీ పంజాబ్ ఎన్నికల్లోనూ, ఇపుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇద్దరిదీ ఎవరి దారి వారిదే అయింది. కాంగ్రెస్ నేతలు అరవింద్ ను దేశ వ్యతిరేకిగా ముద్రవేయడంపై ఆప్ భగ్గుమంది. అజయ్ మేకన్ బీజేపి నేతలస్క్రిప్టు చదువుతున్నారని, వారి సూచనల మేరకే మాపై  ఆరోపణలుచేసి నోరు పారేసుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అదితీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాజాగా అరవింద్ పై పోలీస్ కేసులు కూడా కాంగ్రెస్ ఫైల్ చేస్తోందని ఈ ధోరణి వల్ల కాంగ్రెస్ తో కలసి కూటమిలో కొనసాగడం  తమకు కష్టం గా ఉందని వారంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com