27.2 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

32 దేశాలకు..59 మంది ఎంపీలు

పహల్గామ్ ఉగ్రదాడి, పాక్ లో ఉగ్రవాద శిబిరాల ధ్వంసం తర్వాత భారత్ దౌత్య యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న తీరు..పొరుగు దేశాలకు జరుగుతున్న నష్టంపై ప్రపంచ దేశాలకు తెలియచేసేందుకు పార్లమెంటు సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.

ఈ బృందం బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయంతో సహా 32 దేశాలకు వెళ్లనున్నారు. ప్రతి ప్రతినిధి బృందంలో ఏడుగురు, ఎనిమిది మంది నేతలున్నారు. వారికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేస్తారు. ఏడు ప్రతినిధి బృందాలలో కలిపి 59 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి 31 మంది, ఇతర పార్టీల నుండి 20 మంది ఉన్నారు. ప్రతి ప్రతినిధి బృందంలో ఒక ముస్లిం ఎంపి ఉన్నారు. ఎవరు ఏ దేశాలకు వెళ్తున్నారు? ఏ గ్రూప్‌లో ఉన్నారో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గ్రూప్‌-1
ప్రతినిధి బృందం నాయకుడు: బిజెపి ఎంపి బైజయంత్ పాండా
సభ్యులు: నిషికాంత్ దూబే (బిజెపి), ఫాంగ్నాన్ కొన్యాక్ (బిజెపి), రేఖా శర్మ (బిజెపి), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఐఎం), సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్, హర్ష్ ష్రింగ్లా
పర్యటించే దేశాలు: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా

గ్రూప్-2
ప్రతినిధి బృందం నాయకుడు: బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్
సభ్యులు: దగ్గుబాటి పురందేశ్వరి (బిజెపి), ప్రియాంక చతుర్వేది (శివసేన (యుబిటి), గులాం అలీ ఖతానా, అమర్ సింగ్ (కాంగ్రెస్), సమిక్ భట్టాచార్య (బిజెపి), ఎంజె అక్బర్, పంకజ్ సరన్
పర్యటించే దేశాలు: UK, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్‌

గ్రూప్-3
ప్రతినిధి బృందం నాయకుడు: JDU ఎంపీ సంజయ్ కుమార్ ఝా
సభ్యులు: అపరాజిత సారంగి (బిజెపి), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్), బ్రిజ్ లాలా (బిజెపి), జాన్ బ్రిట్టాస్ (సిపిఎం), ప్రదాన్ బారుహ్ (బిజెపి), హేమంగ్ జోషి (బిజెపి), సల్మాన్ ఖుర్షీద్, మోహన్ కుమార్
పర్యటించే దేశాలు: ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్‌

గ్రూప్-4
ప్రతినిధి బృందం నాయకుడు: శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే
సభ్యులు: బన్సూరి స్వరాజ్ (BJP), ET మహమ్మద్ బషీర్ (IUML), అతుల్ గార్గ్ (BJP), సస్మిత్ పాత్ర (BJD), మనన్ కుమార్ మిశ్రా (BJP), SS అహ్లువాలియా, సుజన్ చినోయ్
పర్యటించే దేశాలు: యుఎఇ, లైబీరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్

గ్రూప్‌-5
ప్రతినిధి బృందం నాయకుడు: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
సభ్యులు: శాంభవి (LJP (రామ్ విలాస్)), సర్ఫరాజ్ అహ్మద్ (JMM), GM హరీష్ బాలయోగి (TDP), శశాంక్ మణి త్రిపాఠి (BJP), భువనేశ్వర్ కలిత (BJP), మిలింద్ మురళీ దేవరా (శివసేన), తరంజిత్ సింగ్ సంధు, తేజస్వి సూర్య (BJP)
పర్యటించే దేశాలు: USA, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా

గ్రూప్-6
ప్రతినిధి బృందం నాయకురాలు: డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి
సభ్యులు: రాజీవ్ రాయ్ (SP), మియాన్ అల్తాఫ్ అహ్మద్ (NC), బ్రిజేష్ చౌతా (BJP), ప్రేమ్ చంద్ గుప్తా (RJD), అశోక్ కుమార్ మిట్టల్ (AAP), మంజీవ్ S పూరి, జావేద్ అష్రఫ్
పర్యటించే దేశాలు: స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా

గ్రూప్‌ – 7
ప్రతినిధి బృందం నాయకుడు: NCP (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సులే
సభ్యులు: రాజీవ్ ప్రతాప్ రూడీ (బిజెపి), విక్రమజీత్ సింగ్ సాహ్నీ (ఆప్), మనీష్ తివారీ (కాంగ్రెస్), అనురాగ్ సింగ్ ఠాకూర్ (బిజెపి), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్
పర్యటించే దేశాలు: ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com