కాంగ్రెస్ టార్గెట్ గా మోడీ తీవ్ర విమర్శలు
ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించమని ఇవాళ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇలా మాట్లాడటం ప్రతీవారికి ఫ్యాషన్ అయిపోయింది.గత 30, ఏళ్లుగా కులం గురించి మాట్లాడటం ఓ అలవాటైన రొటీన్ గా మారిపోయింది.ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించమని ఇవాళ అడుగుతున్నారు.మరి ఆనాడేమయ్యాయి మీ చేతలు, తెలివి తేటలు. బీజేపి ఒచ్చిన తర్వాత ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించాం. గతంలో ఎన్నడైనా ఒక ఎస్టీ కుటుంబం నుంచి ఒకే సారి ముగ్గురికి ఎంపీ పదవులు వచ్చాయా? ఓబీసీలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించింది మేమే. గతంలో ఎన్నడైనా ఒ ఎస్టీ కుటుంబం నుంచి ముగ్గురు ఎంపీలు అదీ ఒకేసారి అవగలిగారా? అని మోడీ విపక్షాలను ప్రశ్నించారు.
ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి
ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాఖ్ నుంచి విముక్తి కలిగించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని మోడీ అన్నారు.రాజ్యాంగాన్ని మడిచి జేబులో పెట్టుకు తిరిగే వారికి ముస్లిం మహిళలు ఈ అనైతిక విడాకుల విధానంతో పడుతున్న బాధలు పట్టవు. వారికి ఆలోచించే శక్తి కూడా లేదు అంటూ మోడీ కాంగ్రెస్ ను ఏకిపారేశారు.
తుక్కు నుంచి కూడా డబ్బు తెచ్చాం
మా పరిశుభ్రత నినాదంపైనా విమర్శలు రేగుతున్నాయి.ఆఫీసుల నుంచి చెత్త, నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ ను అమ్మి దేశానికి రూ.2,300 కోట్లు ధనాన్ని తీసుకొచ్చాం.. దేశ సేవలో నమ్మకమైన భాగస్వామ్యం కావాలని గాంధీ అంటుండేవారని, తమ ప్రభుత్వం అలాగే సేవలో భాగస్వామిగా మారి చెత్తనుంచి కూడా డబ్బును సంపాదించి దేశానికి ఇచ్చిందని మోడీ అన్నారు.
కొన్ని కుటుంబాలకు మ్యూజియంలు
దేశ రాజధాని ఢిల్లీలో వారసత్వ రాజకీయాలు చేసే కొన్ని కుటుంబాలకు ఏకంగా మ్యూజియంలు ఉన్నాయని మోడీ ఎద్దేవా చేశారు.కానీ తాము అధికారంలోకి వచ్చాక దేశ ప్రధానులందరికీ కలపి ఒక మ్యూజియం ఏర్పాటు చేయ సంకల్పించామని, ప్రధానుల కుటుంబ సభ్యులు ఆ మ్యూజియాన్ని సందర్శించి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.ఎవరికి వారు దర్జాగా బతకడం చాలా సులభమే.. రాజ్యాంగం గురించి మాట్లాడే వారంతా ఇక్కడే ఉన్నారు అంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు చురకలేశారు.