22 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

సునీతా విలియమ్స్ టీమ్ ప్రీ ప్లాన్డ్ గానే వెళ్లారా?

  • సోషల్ మీడియాలో చర్చ…
  • ఎట్టకేలకు ఎందుకో చెప్పిన నాసా…

సాంకేతిక కారణాలతో అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతి అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అంతరిక్షంలోక్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియోలో సునీతా విలియమ్స్ రెడ్ టీ షర్టులో ఉండగా, ఇతర ఆస్ట్రో నాట్లు శాంతా క్లాజ్ టోపీలతో కనిపించారు. ఆ వాతావరణమంతా క్రిస్మస్ డెకరేషన్ తో ఉంది. పైగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారంతా మాట్లాడుకుంటున్నారు కూడా.. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెర తీసింది.
ఈవిషయంపై నెట్టింట ఓ రేంజ్ లో కామెంట్లు, చర్చలు వైరల్ అవుతున్నాయి. అంటే క్రిస్మస్ నాటికి అంతరిక్షంలోనే ఉంటామని వాళ్లకి ముందే తెలుసా? అని ఒకరు అనగా… 8 రోజుల ట్రిప్ అన్నారు.. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయారన్నారు.. మరిదంతా ఏంటి? అని మరొకరు ప్రశ్నించారు.క్రిస్మస్ హ్యాట్ లు, ఇతర క్రిస్మస్ సరంజామా వారికి ఎలా చేరింది? అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుక కోసం చాలా ముందుగానే అన్నీ పట్టుకెళ్లారా అని మరికొందరు డౌట్లు వ్యక్త పరిచారు.

నాసా వివరణ..

అయితే వీరందరి సందేహాలకు చెక్ పెట్టింది నాసా. అలాంటిదేమీ లేదని, మొన్న నవంబర్ లో స్పేస్ మిషన్ అక్కడకు వెళ్లిందని అప్పుడు ఈ గిఫ్టులన్నీ వారికి పంపినట్లు వెల్లడించింది.అంతరిక్షంలో పరిశోధనలు జరుపుతున్న ఆస్ట్రోనాట్లకు కావాల్సిన వన్నీ భూమి నుంచి పంపడం ఆనవాయితీయే నని, మొన్న నవంబర్ లో వారికి అవసరమైన వెజిటబుల్స్, పొటాటోస్,కుకీస్, ఇతర ఆహారంతో పాటు క్రిస్మస్ పండుగ వస్తున్ననేపధ్యంలో గిఫ్టులు ఇతర డెకరేషన్ మెటీరియల్ పంపినట్లు నాసా ప్రకటించింది.

ఈ ఏడాది జూన్ లో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సునీతా విలియమ్స్ బ్రుందం 8 రోజుల పర్యటనకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వారు తిరిగి రావడం ఆలస్యమైంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో వారు భూమికి తిరిగి రానున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com