25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

కజకిస్థాన్ విమానం రష్యాయే కూల్చివేసిందా?

  • ద్రోన్ దాడులే కారణమా?
  • క్రిస్మస్ రోజు రష్యా, ఉక్రెయిన్ ద్రోన్ దాడులు?

కజకిస్థాన్ లో విమానం కూలిన దుర్ఘటనలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించి చివరకు పక్షుల గుంపును ఢీకొని కింద కుప్పకూలిందనే అందరూ అనుకున్నారు. కానీ ఈ విమానం కూలడానికి పరోక్షంగా రష్యాయే కారణమనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.అజెర్ బైజాన్ విమానం గ్రోజ్నీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అక్కడ పొగమంచు కారణంగా ల్యాండింగ్ కు వీలు కాక వెనుకకు తిరిగి వస్తున్నక్రమంలో అక్కడ ఎమర్జెన్సీల్యాండింగ్ కు ప్రయత్నించగా రష్యా ఎయిర్ పోర్టు మూసివేయడంతో విమానం దిగడానికి అనుమతి లేదని అంటున్నారు. దీనికి కారణం దక్షిణ రష్యాపై ద్రోన్ దాడులు జరగడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్టును అక్కడి ప్రభుత్వం మూసేసింది. అయితే ఉక్రెయిన్ దాడులకు కౌంటర్ గానే రష్యా దాడులుచేసిందా? లేక దూకుడుగా జరిపిందా అన్నది తేలాలి. విమానంపై రంథ్రాలు కనిపిస్తున్నాయని అవి ద్రోణ్ దాడుల నేపధ్యంలో ఏర్పడినవేనని అంటున్నారు. క్రిస్మస్ రోజున రష్యాతమపై దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపిస్తున్నారు.

ఎలా జరిగి ఉంటుంది?

ఘటనకు ముందు పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు వీలు లేక గాల్లోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో పక్షుల గుంపును విమానం ఢీకొంది. ఆపై సిగ్నల్ వ్యవస్థదెబ్బ తిని ఫ్లైట్ వేగంగా కిందకు జారి పోవడం మొదలైంది. దాంతో దానిని తిరిగి పైకి లేపేందుకు విశ్వ ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు.ఎట్టకేలకు కాస్పియన్ సముద్ర తీరంలో చమురు, సహజ వాయువుల హబ్ లాంటి కజకిస్థాన్లోనే కూలిపోయింది.అయితే ఇది మామూలుగా జరిగిన చర్యా లేక ఉద్దేశపూర్వకంగా జరిగినదా అన్నది తేలాల్సి ఉంది.దీనిపై సమగ్ర దర్యాప్తుకు కజకస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనా స్థలంలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందించే విషయమై ప్రత్యేక టీమ్ ఇప్పటికే ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకుంది.

ప్రముఖులసంతాపం

మరోవైపు విమానం కూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన, కజకిస్థాన్ అధ్యక్షుడు ఇల్హాన్ అలియేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మ్రుతుల కు నివాళులర్పించడమే కాక బాధితులు తక్షణం కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామన్నారు. విషయం తెలసిన వెంటనే రష్యా పర్యటనలో ఉన్న ఇల్హాన్ అలియేవ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. విమానం కుప్పకూలిన ఘటనపై అనేక కథనాలు వినిపిస్తున్నాయని దర్యాప్తు జరిగే వరకూ తానేం మాట్లాడబోనని అంటున్నారు.

ఒళ్లు గగుర్పొడిచే చివరి క్షణాల వీడియో..

ఇక విమానం కూలిపోతున్న చివరి క్షణాలలో విమానంలో ప్రయాణికుల పరిస్థితిపై ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారింది.విమానం వేగంగా కిందకు జారుతున్నప్పుడు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో ఆర్తనాదాలు చేశారు.. యెల్లో ఆక్సిజన్ మాస్కులు సీట్లకు వేళ్లాడుతూ కనిపించాయి. ప్రయాణికుల ఆర్తనదాలు, ఏడుపులతో విమానంలోపల అంతా భయానంగా మారింది.కొందరుల బతుకుమీద ఆశతో అల్లాహో అక్బర్ అని నినాదాలు చేశారు. ఇంతలో డోర్ బెల్ మోగిన శబ్దం ఆవెంటనే సీట్ బెల్టులు పెట్టుకోవాలన్న సంకేతాలు వినిపించాయి.
కేబిన్ లోదే మరో వీడియోలో విమానం రూఫ్ బాగం తల్లకిందులుగా కనిపిస్తోంది. ఎమర్జెన్సీ రెడ్ లైట్లు వెలుగుతూ కనిపించాయి. ప్రయాణికులు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు వినిపించాయి. అయితే ఆ వీడియోమాత్రం విమానం కూలిపోయిన తర్వాత సీన్ అని తెలుస్తోంది. సీట్ల హ్యాండ్ రెస్టులన్నీ రక్తసిక్తమై కనిపించాయి.

ఫ్లైట్ రాడార్ లో క్లియర్ గా..

ఫ్లైట్ రాడార్ లో విమానం కూలిపోయిన ద్రుశ్యాలను చూసినప్పుడు ల్యాండింగ్ అవడానికి నార్మల్ రూట్ లో కాకుండా కాస్పియన్ సముద్రం మీదుగా విమానం వేగంగా వస్తూ కనిపించింది. చివరకు గాల్లోనే చక్కర్లు కొట్టి పక్షుల గుంపును ఢీకొని చక్కర్లు కొట్టిన ప్రదేశంలోనే కుప్పకూలింది. విమానం ఎమర్జెన్సీల్యాండింగ్ కోసం అక్టౌ దగ్గర ప్రయత్నించినప్పుడు డ్రోన్ దాడుల నేపధ్యంలో ఎయిర్ ఫోర్టు మూసి వేయడంతో అనుమతి లేక వెనక్కు వెళ్ల లేక ఈలోపే ప్రమాదం జరిగి ఎయిర్ పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్రానికి దగ్గరలో కూలిపోయి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.67 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన విమానం లో 32 మంది ప్రాణాలతో బయటపడిన దాదాపు అందరి పరిస్థితి సీరియస్ గాన ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com