28.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

కన్నింగ్ కమిన్స్‌ నితీష్‌ కోసం పెద్ద స్కెచే వేశాడా?

నితీష్‌ రెడ్డి టీమిండియాకు ఫాలో ఆన్ గండం తప్పించడమే కాదు.. కంగారుల బెండు కూడా తీశాడు. అందుకే ఎలాగైనా నితీష్‌ సెంచరీని అడ్డుకునేందుకు ఆసీస్ క్యాప్టెన్ కమిన్స్ కన్నింగ్ స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్, నితీష్‌ రెడ్డి 8వ వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 111వ ఓవర్ వద్ద డ్రింక్స్‌ బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత నాథన్ లియోన్ బాల్‌ను తీసుకున్నాడు. ఓవర్‌లో చివరి బంతికి తనదైన స్టైల్‌లో బాల్‌ను తిప్పేసి సుందర్‌ను ఔట్ చేశాడు. ప్యాట్ కమిన్స్ అప్పటి వరకు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు వీరిద్దరిని ఔట్ చేయడానికి. కానీ వారి వల్ల కాలేదు. అప్పటికే బోలాండ్‌ను బరిలోకి దింపి కీలక వికెట్లు తీయించాడు కమిన్స్. సుందర్ ఔటయ్యాక బోలాండ్‌కు మరో ఓవర్ ఇచ్చిన కమిన్స్.. ఆ తర్వాత ఓవర్‌ మాత్రం తానే బరిలోకి దిగాడు. కారణం బుమ్రా బ్యాటింగ్‌కు రావడం.

ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న కమిన్స్.. పర్‌ఫెక్ట్ లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ వేసి బుమ్రాను ఔట్ చేశాడు. అప్పుడు నితీష్ 99 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక క్రీజులోకి వచ్చాడు మహ్మద్ సిరాజ్. అతనికి కమ్మిన్స్ వేసిన బాల్‌ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. నితీష్‌కు మరోసారి స్ట్రైక్ రాకూడదన్న పట్టుదల కనిపించింది కమిన్స్‌లో. సెంచరీని ఎలాగైనా అడ్డుకోవాలనే కసి కూడా ఉంది అందులో. కానీ దేవుడి దయ వల్ల.. నిజంగానే దేవుడి దయ వల్ల కమిన్స్‌ మూడు బాల్స్‌ను సమర్థంగా ఎదుర్కోన్నాడు సిరాజ్. ఈ ఓవర్‌లో మరో రెండు బాల్స్ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బంతి మళ్లీ బోలాండ్‌ చేతికి చేరింది. నిజానికి ఇక్కడ కూడా కమిన్స్ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. మళ్లీ లియోన్‌కు ఇవ్వలేదు. కానీ బోలాండ్ బౌలింగ్‌ను అప్పటికే డీకోడ్ చేసిన నితీష్‌.. 114 ఓవర్‌లో మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. గర్వంగా బ్యాట్‌ ఎత్తాడు. సెంచరీ చేశాడు. సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

మొత్తానికైతే కమిన్స్ పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కిపోకుండా.. అర్జునుడిలా చేధించాడు నితీష్‌. ఇక్క కమిన్స్‌ను తప్పు పట్టాల్సిన పనిలేదు. ఏ బౌలరైనా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలనే చూస్తాడు. కమిన్స్‌ కూడా అదే చేశాడు. కానీ 99 పరుగుల వద్ద అలా జరిగితే మాత్రం నితీష్‌ హిస్టరీలో ఇదో చేదు జ్ఞాపకంగా మాత్రం మిగిలేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com