మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది పది రోజుల సస్పెన్స్ తర్వాత స్పష్టత వచ్చింది. సీఎం ఎవరనేది క్లారిటీ వచ్చింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర పఢ్నవీస్ పేరు ఖరారైంది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశం నిర్వహించనుండగా.. ఈ భేటీలో ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతగా ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నారు.
ఉపముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజీత్ పవార్ ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ సమాచారం. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేవటం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.