ఎవరికైనా హోమ్ గ్రౌండ్‌పై పట్టు ఉంటుంది. అక్కడ అడుగుపెడితే ప్రత్యర్థులు ఎవరైనా చతికిలపడాల్సిందే. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్‌లో గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డపై మాత్రం బోల్తా కొట్టింది. గుజరాత్‌పై దారుణంగా ఓడింది. దీంతో RCB వరుస విజయాలకు బ్రేక్ పడింది.
చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, GT మధ్య జరిగిన మ్యాచ్‌లో వార్ వన్‌సైడ్ అన్నట్టుగానే సాగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన RCB తడబడింది. మొన్నటి వరకు RCB క్యాంప్‌లో ఉండి రీసెంట్‌గా GTలో చేరిన సిరాజ్.. తన సత్తా ఏంటో చాటాడు. కేవలం 19 పరుగులు ఇచ్చిన మూడు వికెట్లు తీశాడు. దీంతో పరుగుల వరకు కళ్లెం పడిందనే చెప్పాలి. అయితే లివింగ్‌స్టన్ 54, జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 పరుగులు చేయడంతో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన GT.. ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. గిల్ మరోసారి నిరాశపరిచినా.. బట్లర్, సాయి సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. సుదర్శన్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అవుతుందని భావించినా.. బట్లర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రూథర్ ఫర్డ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. బట్లర్ 73 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రూథర్ ఫర్డ్ కూడా మూడు సిక్స్‌లు బాది 30 పరుగులు చేసి విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడనే చెప్పాలి.
ఈ మ్యాచ్‌లో GT బౌలింగ్ అదుర్స్ అనే చెప్పాలి. పడిక్కల్, ఫిల్ సాల్ట్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. పాటిదార్‌ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు పంపాడు. ఇక సాయి కిశోర్ కూడా దూకుడు మీదున్న జితేష్ శర్మను ఔట్ చేయడం మరో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అయితే RCB పరువు కాపాడింది మాత్రం లివింగ్‌స్టన్, టిమ్ డేవిడ్ అనే చెప్పాలి. వీరిద్దరు కలిసి చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు చేశారు.