28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

నాలుగు పంచాయతీలకు దీన్ దయాళ్ పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు అగ్ర స్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ పంచాయతీలు అవార్డులు పొందాయి.
పురస్కారాలు పొందిన పంచాయతీలకు ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీలకు పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పవన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీలు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయన్నారు. పురస్కారాలు సాధించి గొప్ప విజయాన్ని పొందిన పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికీ అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్… క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. రాష్ట్ర గ్రామ పంచాయతీలు దృఢ చిత్తంతో, అంకిత భావంతో పని చేస్తున్నాయన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com