27.2 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

25 నుంచి గణపతి సచ్చిదానంత స్వామి పుట్టినరోజు వేడుకలు

పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 83వ జన్మదిన ఉత్సవాల కోసం మైసూరులోని దత్తపీఠం ముస్తాబవుతోంది. అధ్మాత్మిక గురువుగా దత్తాత్రేయ అవతారంగా భక్తులు స్వామిని కొలుస్తారు.  శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజును దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు. శ్రీ స్వామీజీని దర్శనం చేసుకొని భక్తి చాటుకుంటారు.

గణపతి సచ్చిదానంద స్వామి కర్ణాటకలోని మేకేదాటులో 1942 మే 26 న జన్మించారు. ఆయన తండ్రి గండ్లూరు నరసింహశాస్త్రి, పండిత వైదిక పూజారి, తల్లి జయలక్ష్మి యోగిని.  శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, దత్తాత్రేయ యొక్క అవతారంగా భావిస్తారు. హిందూ తత్వశాస్త్రం, యోగం, మరియు ఆధ్యాత్మికతలో ఒక గొప్ప గురువుగా పరిగణించబడతాడు. సచ్చిదానంద బోధనలు, సేవ కార్యక్రమాలు సమాజంలో మార్గదర్శిగా ఉన్నాయి.

అవధూత దత్త పీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ. ఇది సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు, శ్రీ దత్తాత్రేయ బోధనలు… ఆధ్యాత్మిక ఉద్ధరణకు ప్రసిద్ధి చెందింది. దత్త పీఠం మైసూరులోని చాముండి కొండ దిగువన విశాలమైన ప్రాంగణంలో ఉంది.

అవధూత పీఠం ప్రాంగణంలో ఈ నెల 25వ తేదీన( ఆదివారం) గణపతి హోమంతో ప్రారంభం అవుతాయి.  జూన్‌ ఒకటో తేదీ వరకు పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కార్యక్రమాల వివరాలు

25.05.2025

  1. 9am గణపతి హోమం
  2. 5pm శేష వాహన ఉత్సవం శ్రీ దత్త వెంకటేశ్వర మందిరం
  3. 6pm 26 బ్రహ్మోత్సవ వేడుకలతోపాటు సచ్చిదానంద స్వామి 83వ పుట్టినరోజు వేడుకలు ఆరంభం అవుతాయి

26.05.2025

8am దత్త వెంకటేశ్వర గుడిలో రుద్ర హోమం, ఆయుష్షు హోమం, రుద్రాభిషేకం

8am నాదమండపంలో చక్ర పూజ

9am పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి పూజ్య విజయానంద తీర్థ స్వామి పాద పూజ చేస్తారు

10am   చైతన్య ఆర్చన

వేద నిధి – —–=                  శ్రీ విష్ణుభట్ల లక్ష్మి నారాయణ గణపతి

శాస్త్ర నిధి  =                        శ్రీ  కుప్పా విశ్వనాథ శాస్త్రి

నాద నిధి =                         శ్రీ వినాయక తోర్వి

నాద నిధి -=                      విద్వాన్‌ శశాంక్‌ సుబ్రమణ్యం

నాట్య నిధి                        టిఎస్‌ శ్రీలక్మి

ఆస్థాన శిల్పి                       శ్రీ కృష్ణమూర్తి

జయలక్ష్మి పురస్కారం = శ్రీ గంగవరం వేదవతి

జయలక్ష్మి పురస్కారం = శ్రీ గీత పుంజాల

దత్తపీఠం బంధు                 శ్రీ కమల్‌ కపూర్‌

దత్తపీఠం బంధు                 శ్రీ కంతేటి శ్రీనివాస్‌

సస్య పురస్కారం                శ్రీమతి సుచిత్రా రెడ్డి

3pm గోపిక పూర్ణిమ, మల్లిఖార్జున్‌ల కర్ణాటక సంగీత కార్యక్రమం

5pm దత్త వేంకటేశ్వర మందిరంలో సింహ వాహన ఉత్సవం

6pm నాద మండపంలో 27వ వార్షికోత్సవ వేడుకలను పరమపూజ్య శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజి( సుత్తూరు మహాపీఠం)వారు ప్రారంభిస్తారు

7pm కర్ణాటక వోకల్‌ డ్యూయెట్‌ కన్సార్ట్‌

దత్తపీఠం ఆస్థాన విదూషకులు సర్వేపల్లి సిస్టర్స్‌, డాక్టర్‌ శ్రేయ మరియు రాజ లక్ష్మి, వాయోలిన్‌ పృధ్వీ భాస్కర్‌, మృదంగం ప్రణవ సుబ్రమణ్యం, ఘటం షమిత్‌ ఎస్‌ గౌడ

27.05.2025

8am శ్రీ చక్ర పూజ

9am శ్రీదత్త వేంకటేశ్వర గుడిలో పద్మావతి అభిషేకం, లక్ష్మి హోమం

3pm కల్పన సుమంత్‌ రాఘవేంద్రలతో హిందుస్థాని సంగీత కార్యక్రమం

5pm శ్రీదత్త వేంకటేశ్వర గుడిలో హనుమద్‌ వాహన ఉత్సవం

7pm కున్నకుడి బాలమురళి కృష్ణ, వాయోలిన్‌ హెచ్‌ ఎన్‌ భాస్కర్‌, మృదంగం చిదాత్త దత్త చాగంటి వారితో కర్ణాటక సంగీత కార్యక్రమం

28.05.2025

8am శ్రీ చక్ర పూజ

9am శ్రీదత్త వేంకటేశ్వర గుడిలో సాలగ్రామ పూజ

3pm  జుగల్‌ బందీ సంగీత కార్యక్రమం

వాయొలిన్‌ పేరి త్యాగరాజు, ఫ్లూట్‌ ప్రమోద్‌ ఉమాపతి,

5pm గరుడ వాహన ఉత్సవం

7pm శ్రీరామ్‌ జొన్నలగడ్డ వారి బృందంతో కర్ణాటక సంగీత కార్యక్రమం

29.05.2025

8am శ్రీ చక్రపూజ

9am ధన్వంతరి పూజ, ధన్వంతరి హోమం

3pm వికాస్‌ మైత్రేయ గారి కర్ణాటక సంగీత కార్యక్రమం

5pm డోలోత్సవం

7pm సత్యనారాయణ రాజు భరత నాట్యం

30.05.2025

9am బ్రహ్మో్త్సవ మహాభిషేకం

3pm డాక్టర్‌ రామప్రభ ఎర్రమిల్లి గారి కర్ణాటక సంగీత కార్యక్రమం

7pm సప్తర్షి సరోవరంలో తెప్పోత్సవం

31.05.2025

7am శ్రీదత్త హనుమాన్‌ సర్విసెస్‌ వాలంటీర్ల పరేడ్‌

8am శ్రీచక్ర పూజ

9am శాంతి కల్యాణ మహోత్సవం

10am డిస్ట్రిబ్యూషన్‌ అఫ్‌ చారిటీస్‌

5pm  రుద్రాక్ష రథ ఉత్సవం

7pm రవీంద్ర గురురాజ్‌ కటోటి గారి హర్మోనియం ప్రత్యేక కార్యక్రమం

01.06.2025

7am దత్తాత్రేయ, మృత్యుంజయ, ఆయుష్య హోమం

8am శ్రీ చక్ర పూజ

9am ఊడుంబర సింహాసన అధిరోహణం, భక్తుల సమర్పణ

6pm ఆశ్రమ భజన మండలి వారిచే దత్త ప్రభు స్మరణ భజనలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com