25.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

పెద్దమొత్తంలో చెట్లు నరకడం హత్యానేరం కంటే ఘోరం – సుప్రీంకోర్టు

పెద్ద మొత్తంలో చెట్లను నరకడం అంటే.. ఒక మనిషిని చంపడం కంటే ఏమాత్రం తీసిపోని నేరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆగ్రా లోని తాజ్ ట్రెపీజియం జోన్‌లో ముందస్తుగా అనుమతులేవీ తీసుకోకుండా ఏకంగా 454 చెట్లు నరికేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కఠినంగా వ్యాఖ్యలు చేసింది.

చెట్లు నరికి వేసిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి పెద్దమొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. నరికేసిన 454 చెట్లకు గాను ఒక్కో చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా తాజ్ ట్రెపీజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2019లో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. తాజ్ ట్రెపీజియం జోన్ పరిధిలో అటవీ ప్రాంతం కానిచోట, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు గుర్తుచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ సంచలన తీర్పు వెలువరించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com