25.1 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ప్రధానమంత్రి పర్యటనపై సిఎస్ విజయానంద్ ప్రాధమిక సమీక్ష

 

అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలకు ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతికి రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రాధమిక సమీక్ష నిర్వహించారు.ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.ఇటీవల పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఆదిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ సూచించారు.డిజిపి, సిఆర్డిఏ అధికారులు,గుంటూరు జిల్లా కలక్టర్,ఎస్పి,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వీర పాండియన్ తదితర అధికారులు వెంటనే ఆప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదికను సిద్దం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

అంతేగాక గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఆయా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రస్తుత వేసవి దృష్ట్యా కార్యక్రమానికి వచ్చే వివిఐపి,విఐపిలు,ప్రజలు తదితరులు అందరికీ తగిన పూర్తి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు.ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో మరొక సారి శాఖల వారీ ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని ఈలోగా తగిన ప్రాధమిక కసరత్తు ప్రారంభించాలని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.

రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినపుడు వివిధ పనుల నిర్వహణ,పర్యవేక్షణకు అధికారులు,మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అదే రీతిలో ఇప్పుడు కూడా కమిటీలు వేయాల్సి ఉందని చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com