32.9 C
Hyderabad
Saturday, June 13, 2026

Live Video

spot_img

కోట్లు కురిపించిన రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది. ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ల ద్వారా.. జనవరి 31వ తేదీ ఒక్కరోజే రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరి 30వ తేదీ కూడా రూ.107 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.246 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. భూముల కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. సవరించిన విలువలతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారం పెరిగింది. దీంతో ఛార్జీల భారం పడకుండా.. జనవరి 30, 31వ తేదీల్లో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆస్తుల క్రయ, విక్రయదారులతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు రద్దీగా కనిపించాయి. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

జనవరి 31న ఎక్కువ ఆదాయం వచ్చిన టాప్ 10 జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

1.విశాఖపట్నం- రూ.16.94 కోట్లు
2.గుంటూరు- రూ.16.92 కోట్లు
3.ఎన్టీఆర్ జిల్లా- రూ.12.07 కోట్లు
4.తూర్పుగోదావరి- రూ.11.35 కోట్లు
5.తిరుపతి- రూ.8.94 కోట్లు
6.కృష్ణా జిల్లా- రూ.6.69 కోట్లు
7.కాకినాడ- రూ.6.14 కోట్లు
8.పశ్చిమ గోదావరి- రూ.5.78 కోట్లు
9.నెల్లూరు- రూ.5.69 కోట్లు
10.అనంతపురం- రూ.5.19 కోట్లు

20 శాతం వరకు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0 శాతం మాత్రమే ఉంటాయి.

విజయవాడ, విశాఖపట్నం తోపాటు కోనసీమ, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్ని చోట్ల ఛార్జీలను తగ్గించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే ఉండనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com