మాజీ ఎంపి నుస్రత్ జహాన్ పశ్చిమ బెంగాల్‌లోని బసీర్ హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019లో ప్రాతినిధ్యం వహించారు. కలకత్తా బెంగాలీ ముస్లిం కుటుంబానికి చెందిన నుస్రత్…జనవరి 8 1990న జన్మించారు. మోడల్ గా, హీరోయిన్ గా, ఎంపిగా ఆ తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా… అన్ని సమయాల్లోను నుస్రత్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా దర్శనమిస్తుంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా పార్లమెంటులో అడుగుపెట్టిన నుస్రత్.. బెంగాలి భాషా చిత్రం షోత్రుతో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించింది.
కోల్‌కతాలోని అవర్ లేడీ క్వీన్ ఆఫ్ ది మిషన్స్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన నుస్రత్ జహాన్… కోల్‌కతాలోని భవానీపూర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ చేసింది.
2010 అందాల పోటీలో గెలిచిన తర్వాత నుస్రత్ మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. 2021లో ఒక అబ్బాయికి తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా..నుస్రత్ తనకు ఇష్టమైన మోడలింగ్, సినిమా రంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.
నుస్రత్ జహాన్ 2019లో వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను టర్కీలో వివాహం చేసుకుంది. ఎంపిగా ఉండగానే వివాహం చేసుకున్న నుస్రత్… మతాంతర వివాహం చేసుకుందని ముస్లీం వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
మతాంతర వివాహంపై ముస్లీం వర్గాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా నుస్రత్ లెక్కచేయలేదు. పైగా వైవాహిక జీవితంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించి తను డేర్ డివెల్ అని నిరూపించుకుంది.
సందేశ్ ఖలి వివాదంతో బసీర్ హట్ పార్లమెంటు నియోజకవర్గం జాతీయ స్థాయిలో సంచలనం కాగా.. టిఎంసి నుస్రత్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం అయింది.
2019లో ఎంపిగా గెలిచాక పార్లమెంటు సమావేశాల మొదటి రోజు నుస్రత్ ప్రమాణ స్వీకారం కోసం రావల్సి ఉండగా.. గైర్హాజరు అయింది. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవటంతో ఆస్పత్రి పాలయ్యిందని అప్పట్లో బెంగాలి చిత్రపరిశ్రమ టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.
నుస్రత్ జహాన్ ఎంపిగా ఉన్న సమయంలోనే జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి మిమి చక్రవర్తి ఎంపిగా గెలిచింది. వీరిద్దరు పార్లమెంటు సమావేశాలకు వస్తుంటే కెమరాలన్నీ వాళ్లిద్దరినే ఫాలో అయ్యేవి.
బెంగాలి సినిమాల్లో అధికంగా నటించిన నుస్రత్…తన క్రేజ్ కొనసాగిస్తోంది. 2025 మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.