- మధ్యప్రదేశ్ లో బీజీపీ మంత్రిని ఓడించాం
- కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం
- కేటీఆర్ పద్దతి మార్చుకోవాలి – డిప్యూటీ సీయం భట్టి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కుట్రలను ఛేదించి జార్ఖండ్ ప్రజలు విజయం సాధించారన్నారు. దేశవ్యాప్తంగా చాలా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిదని, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో మంత్రినే ఓడించామని చెప్పారు. అయితే మీడియా మాత్రం మహారాష్ట్ర ఓటమిని మాత్రమే ఫోకస్ చేస్తోందని అన్నారు. త్వరలోనే స్థానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ చేశామన్నారు. రైతు భరోసా విషయంలో విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. పదేళ్ళ పాలనలో కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దే పనిలో ఉన్నామన్నారు. తన హయాలంలో కేసీఆర్ ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో… ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధంకాడం లేదన్నారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇష్టా రీతిన తిట్టడం ఏం రాజకీయమన్నారు. జిల్లా కలెక్టర్లను అసభ్య పదజాలంతో తిట్టడమేంటని, కేటీఆర్ తన పద్దతి మార్చుకవాలన్నారు. ఏక్ హై తో సేఫ్ హై నినాదం వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటని… దేశమంతా ఒకే కులమని బీజేపీ చేపుతోందా అని భట్టి ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుల గణన లెక్క తేలిన తరువాత పూర్తి నివేదికను సమాజం ముందు చర్చకు పెడతామని డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క మీడియా చిట్ ఛాట్ లో వ్యాఖ్యానించారు.