మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. బుధవారం ఉదయం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైల్వేమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు నిలిపేసిన రైల్వే పాసులను తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతిపాదనలో ఉన్న పలు RUB, ROB పనులు వీలైనంత తొందరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో కూడా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. అంతేకాకుండా.. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఎక్స్‌ప్రెస్ రైళ్ల జాబితాను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు అందజేశారు.