కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో డ్రామా ఆడుతోందని బీజెపి ఎంపి ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. మొక్కుబడిగా సర్వే చేసి బీసీ జనాభా తగ్గినట్టుగా చూపటం దారుణమన్నారు. కులగణన పారదర్శకంగా చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
ఈటెల రాజేందర్ కామెంట్స్…
స్కూల్ అడ్మిషన్ కి వెళితే అప్లికేషన్లో కులం ఏంటి అని రాయాలి. కులంను కాదనలేము. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు కానీ డ్రామా కంపెనీకి వ్యతిరేకం.
లంబాడాలు మన దగ్గర ఎస్టీలు, కర్ణాటకలో ఎస్సీలు.
రజకులు మనదగ్గర బీసీలు, కర్ణాటకలో ఎస్సీలు.
రెడ్డిలు మన దగ్గర ఓసీ, కర్ణాటక లో బీసిలు.
మత్స్యకారులు మనదగ్గర బీసీ, యూపీలో ఎస్సీలు.
దేశవ్యాప్తంగా గణన చేస్తే ఎవరిని ఏ కులంగా గుర్తిస్తారు..
అర్థం ఉందా ?
అసలు వారి(కాంగ్రెస్) నిజాయితీ గురించి అడుగుతున్న… రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ తొంభై శాతం అణగారిన వర్గాలకు నిలయం అంటారు మరి కులగణనలో బీసీల సంఖ్య ఎలా తగ్గింది ? వారి లెక్కల ప్రకారం ఎస్సీలు 15 శాతం నుండి 17.6 శాతానికి, ఎస్టీలు 9 నుండి 10.5 శాతానికి, బీసీలు 52 నుండి 46 శాతానికి అని ప్రకటించారు. ఒక్క బీసీ జనాభా తగ్గింది.
మీరు చేసిన కులగణనకు చట్టబద్ధత ఉందా ?
సుద్దపూస అయితే మళ్లీ ఎందుకు చేస్తున్నారు ?
రెండవ సారి చేయడమే రేవంత్ వైఫల్యం.
తమిళనాడు, బీహార్ లాగా చట్టబద్దంగా చేస్తే ఒప్పుకుంటాం.
పార్టీల పరంగా రిజర్వేషన్ ఇద్దాం అనడానికి నువ్వెవడివి.
ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి లేదంటే మీ భరతం పడతాం.