29.3 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

మూసీ ప్రక్షాళనకు సహకరించండి – లోక్‌సభలో కేంద్రాన్ని కోరిన ఈటల

హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని, నది వెంట.. మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, దీనిని ప్రాధాన్యతా అంశంగా గుర్తించాలని మల్కాజ్‌ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ జలశక్తి శాఖా మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన లోక్‌సభలో పలు అంశాలపై ప్రసంగించారు. మూసీ ప్రక్షాళనతో పాటు.. మురుగు నీటి శుద్ధికి, శుభ్రమైన తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని పార్లమెంట్‌ వేదికగా కోరారు. వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవాలును గుర్తించి, స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) కింద పారిశుధ్యం, సురక్షితమైన తాగునీటి సౌకర్యాల కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించడం ప్రశంసనీయమన్నారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వివిధ నగరాలు, రాష్ట్రాల నుండి ప్రజలు జీవనోపాధి కోసం వలస వచ్చిన వాళ్లకు కేంద్రంగా మారిందన్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి కలుగుతోందని, స్థానిక అధికారులు కూడా పెరుగుతున్న డిమాండ్లను తీర్చడం కష్టమవుతోందన్నారు. అందుకే పారిశుద్ధ్య ప్రాజెక్టులకు, తాగునీటి సౌకర్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు.

హైదరాబాద్‌లోని చెరువులు మురుగునీటితో కలుషితం అయ్యాయని, ఫలితంగా పర్యావరణ సంక్షోభం నెలకొంటుందన్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌తో సహా.. నీటి వనరులు అన్నీ మురుగునీటి ప్రవాహాలతో కలుషితమయ్యాయని, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయన్నారు. ఈ చెరువులను పునరుద్ధరించడానికి, మురుగు నీటిని మళ్లించడానికి, ప్రత్యామ్నాయ మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శుద్ధి చేసిన నీరు మాత్రమే సరస్సులలోకి వచ్చేలా మురుగునీటి శుద్ధి కర్మాగారాలను బలోపేతం చేయడం వంటి తక్షణ ప్రత్యామ్నాయాలకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని మూసీ నది ఒకప్పుడు నగరానికి తాగునీటి వనరు అని, ఇప్పుడు తీవ్రమైన కాలుష్య సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన వ్యర్థాల కారణంగా తీవ్రంగా కలుషితమైందన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడి అయిన ఈ నది ఇప్పుడు విషపూరిత వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాల కారణంగా తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందన్నారు. నదిని ఏ వినియోగానికి పనికిరాకుండా చేసిందన్నారు. ఈ నదీ పరీవాహకంలో నీటి శుద్ధి ప్లాంట్లకు నిధులు కేటాయించాలని కోరారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com