29.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

నేడు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్న సీయం రేవంత్‌

ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో భారత రక్షణ దళాలు పాకిస్తాన్‌ మరియూ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఉన్న ఉగ్ర స్ధావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో ఆర్మీ, పోలీస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లతో పాటు ఇతర సంబంధిత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈ సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి సీయం రేవంత్‌ ఫోన్‌ చేసి తక్షణం బయలుదేరి హైదరాబాద్‌ రావాలని సూచించారు. భారత దేశ రక్షణ వ్యవస్ధలో హైదరాబాద్‌ వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక డిఫెన్స్‌ విభాగాలకు స్ధావరంగా హైదరాబాద్‌ ఉన్నందున తాజా పరిస్ధితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలకు సియం ఈ సమావేశంలో దిశానిర్ధేశం చేయనున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ ఆదేశాను సారం ఈ రోజు నిర్వహించే మాక్‌ డ్రిల్‌ ఏర్పాట్లపై కూడా సీయం స్వయంగా పర్యవేక్షించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com