వయనాడ్ ఉప ఎన్నికల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణలో తాజా రాజకీయాలపై ప్రియాంక గాంధీతో చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యేందుకు సిఎం, డిప్యూటీ సిఎం ఢిల్లీ వెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టుల ఆంశాల్లో రాష్ట్ర ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.