అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి ఖర్చులు భరించలేని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ బాధితులకు అందజేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ గ్రామానికి చెందిన జొన్నాడ శ్రీలత, పుప్పాలగూడ వాసి రేణుకలు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రులో చికిత్స చేయించుకున్నారు. వారి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఇరువురికి రూ.60వేల చొప్పున మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బుదోళ్ల శ్రీరాములు, సీనియర్ నాయకులు పిట్టల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏర్పుల కుమార్,శ్రవణ్ కుమార్, విజయ్ రెడ్డి, సంపత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.