నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది. ఇది 2007లో విడుదల అయింది. ఆ తర్వాత కుర్రాడు (2009) సినిమాలో కూడా నటించింది. కైపెక్కించే చూపులతో ఆకట్టుకునే నేహా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. సముద్ర తీరంలో తన అందచందాలు ఆరబోసిన నేహా కొత్త సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకుంది.
నేహా శర్మ 1987లో బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించింది. బీహార్ లోనే పాఠశాల విద్య పూర్తిచేసిన నేహా న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (NIFT) కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.
నేహా తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భాగల్పుర్ అసంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాడు.
తెలుగులో రెండు సినిమాలతో పాటు హిందీలో సుమారు 15 వరకు సినిమాలు చేసింది. అయితే 2017 తర్వాత సినిమా ఆఫర్లు తగ్గాయి.
టీవి షోల్లో చేసినా ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. మళ్లీ బాలీవుడ్లో చాన్స్ ల కోసం కురచ దుస్తులతో అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
చిరుత సినిమా సమయంలో రామ్ చరణ్, నేహాల మధ్య కెమిస్ట్రీ కుదిరిందని పుకార్లు షికారు చేశాయి. మెగా ఫ్యామిలీ వెంటనే అలర్ట్ అయినట్టు అప్పట్లో ఫిలింనగర్లో చర్చలు జరిగేవి.
courtesy:instagram