30.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

కానిస్టేబుల్‌ ప్రాణాలమీదకు తెచ్చిన చైనా మాంజా

పతంగులకు ఉపయోగిస్తున్న చైనా మాంజా ఓ కానిస్టేబుల్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతికి పతంగుల పండుగ జరుపుకోవడం, పిల్లలు, పెద్దలు కేరింతలు కొట్టడం పరిపాటే. అయితే, ఈ పతంగులకు సాధారణ మాంజా మాత్రమే వినియోగించాలని, చైనా మాంజా అసలు వాడొద్దని కొన్నేళ్లుగా ప్రభుత్వం, పోలీసులు, స్వచ్చంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు.. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించింది కూడా. ఎందుకంటే ఈ చైనా మాంజా రోడ్లమీద వెళ్లే వాహనదారుల మెడకు చుట్టుకొని ప్రాణాల మీదకు తెస్తోంది. అలాగే పశువులు కూడా ఈ చైనా మాంజా ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ కారణంగా చైనా మాంజాను తయారు చేయడం గానీ, అమ్మడం గానీ, పతంగులకు కట్టి వినియోగించడం గానీ నేరం. కానీ, కొందరు వినడం లేదు. పతంగులకు చైనా మాంజాను వాడుతున్నారు. ఈ పరిణామం తాజాగా ఓ కానిస్టేబుల్‌ మెడకు గాయమయ్యేందుకు కారణమైంది. లంగర్‌హౌజ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శివరాజ్‌ విధినిర్వహణలో భాగంగా సిటీకి వచ్చాడు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ లిమిట్స్‌లో శివరాజ్‌ బైక్‌పై వెళ్తుండగా.. పతంగుల నుంచి తెగిపోయిన చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. దీంతో, శివరాజ్‌ మెడకు తీవ్ర గాయమయ్యింది. నారాయణగూడ ఫ్లైఓవర్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే శివరాజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. చైనా మాంజా మెడకు చుట్టుకున్న సమయంలో శివరాజ్‌ బైక్‌పై నెమ్మదిగా వెళ్తుండటంతో చిన్నగాయంతో ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ స్పీడ్‌గా వెళ్తుంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదంటున్నారు స్థానికులు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com