ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు టీమ్
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు వెళుతున్నారు. ఆయనతో పాటు 9మంది బృందం వెళుతోంది. ఈ నెల 20 నుంచి 24 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, విశాఖపట్నం, విజయవాడ అమరావతి, తిరుపతి ఇలా ఎన్నో ప్రముఖ ప్రాంతాలు, సముద్ర తీరం, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వ సహకారం ఇవన్నీ.. ప్రపంచ ఆర్ధిక సదస్సులో సీఎం చంద్రబాబు, లోకేష్ వివరించనున్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని దావోస్ పర్యటన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం సెక్యూరిటీ అధికారి శ్రీనాథ్ బండారు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ, కాడా పీడీ వికాస్ మర్మత్ లు వెళుతున్నారు.