30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

చార్ ధామ్ యాత్ర నిలిపివేత

భారత్ పాకిస్తాన్ యుద్దం నేపథ్యంలో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ దాడులు చేసే అవకాశం ఉండడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది.  బద్రినాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. యాత్ర ఎప్పటి వరకు రద్దు, తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.

బద్రినాథ్ ఆలయం మే 4వ తేదీన ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతించారు. 24 గంటలు పూర్తి కాకుండానే చార్ ధామ్ యాత్ర నిలిపివేత దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం భక్తులను నిరాశపరిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com