విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు. ఆంధ్రప్రభుత్వ సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు సోమవారం మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లలోని నారా లోకేష్ నివాసంలో భేటీ అయిన ఇద్దరు విద్యార్థుల సత్ప్రవర్తన అంశంపై చర్చించుకున్నారు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువుల పట్ల గౌరవం పెంపొందించేలా ప్రత్యేక పాఠ్యంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు లోకేష్ చాగంటికోటేశ్వరరావుకి వివరించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు అందిస్తానని ఈ సందర్భంగా చాగంట కోటేశ్వరరాు మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు.
- Advertisement with us -