35.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

జకీర్ హుస్సేన్ మృతి ప్రముఖుల నివాళి

సంగీత ప్రపంచంలో తన దైన ముద్ర వేసిన అసాధారణ ప్రజ్నా వంతుడు జాకీర్ హుస్సేన్ అని బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేయగా, అద్భుతమైన ప్రయోగాలు చేసి సంగీతానికి అపార నిధిని జాకీర్ కల్పించాడని, ఆయన ముందు తరాలకు ఎంతో సంపదను ఇచ్చి వెళ్లాడని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. జాకీర్ హుస్సేన్ తో తాను కలసి ఉన్న పాత ఫోటోను ఆయన షేర్ చేశారు. ఇక కరీనాకపూర్ తన తండ్రి రణధీర్ కపూర్ , జాకీర్ హుస్సేన్ తో కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. నటులు అక్షయ్ కుమార్, నందితా దాస్ కూడా జాకీర్ హుస్సేన్ తో తమ అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్. రహమాన్ కూడా జాకీర్ తో తాను కలసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి నివాళి అర్పించారు.నటి నిత్యామీనన్, సింగర్ అభిజిత్ భట్టా చార్యతో సహా అనేక మంది జాకీర్ హుస్సేన్ తో తమ అనుబంధాన్ని షేర్ చేసుకునే ఫోటోలను షేర్ చేస్తూ సంతాపం తెలియ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com