26.1 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

తెలంగాణలో మిస్‌ అయిన వాళ్లకు మరోసారి కులగణన

రాష్ట్రంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారికోసం ప్రభుత్వం మరోసారి ఈ అవకాశం కల్పిస్తోందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమగ్ర ఇంటింటి సర్వే పై జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దశాబ్దాల ఓబీసీల కల నిజం చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి, పార్లమెంట్లో పెట్టిస్తామన్నారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కలసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుందని, ప్రధానితోపాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని, విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కూడగడతామన్నారు. రాజకీయ శక్తులను ఏకం చేస్తామన్నారు.

జనాభా వివరాల నమోదుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి అవకాశం కల్పిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కుల గణన విజయవంతం అయితే దేశమంతా చేయాల్సి వస్తుందనుకునేవారు రీ సర్వే కోరుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వంతో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దశాబ్దాల బీసీల కలను నిజం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓ బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తామని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుందని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కడతామని అన్నారు.

టింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారికోసం మరో అవకాశం ఇస్తామన్నారు. రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని, వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్ కేటీఆర్ పల్లా వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదన్న ఉప ముఖ్యమంత్రి.. మరి కొందరు అందుబాటులో లేకుండా పోయారని, వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు.

మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారని, అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది అందరి కోరిక, బలమైన లక్ష్యం అని, దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో కుల గణన విజయవంతం అయితే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తిగా శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఏ వర్గాల జనాభా ఎంతో శాసనసభలో లెక్కలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు, చర్చ కూడా జరిగిందని తెలిపారు. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం, మద్దతు కూడబెట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి.. రాజకీయ పార్టీలు, సోషల్ యాక్టివిస్టులు, మేధావులు, ప్రజలు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 56 శాతంగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com