33.9 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కేసులు – హరీష్‌ రావు

రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడాన్ని కేటీఆర్ అక్రమ కేసుతో పోల్చడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడి వేయడమే అని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం బంజారాహిల్స్‌ కేటీఆర్‌ నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడని, కేటీఆర్‌ తెలంగాణ కోసం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడం కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడని హరీష్‌ రావు అన్నారు. ఇదేరేసును తమ రాష్ట్రాలకు తీసుకువెళ్లాలని అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయని హరీష్‌ రావు తెలిపారు. మాపై ఎన్ని రకాల కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం మానమని ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా వెంటపడతామని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ రోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు అవినీతి జరిగిందని నిర్ధారించలేదని ప్రభుత్వం పెట్టిన కేసులో విచారణ చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ ఎప్పుడూ సిద్దంగానే ఉన్నారని నిన్న ఏసీబీ విచారణకు వెళ్లారని 9వ తేదీ కూడా వెళతారని తెలిపారు. పార్ములీ ఈ రేసులో ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని హరీష్‌ రావు ప్రశ్నించారు. అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కేటీఆర్‌పై ఈ కేసు పెట్టారని హరీష్‌ రావు విమర్శించారు. భవిష్యత్తులో అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలాంటి కేసులు ఎన్నో రేవంత్ రెడ్డి మాపై పెడతాడని తెలుసని అన్నింటికీ సిద్దంగా ఉన్నమన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది, గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. గ్రీన్‌కోకి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారని, అదే గ్రీన్‌కో కంపెనీ ఫార్ములా ఈ రేసు నిర్వహణలో భారీగా నష్టపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితమని హరీష్‌ రావు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com